HomeAndhra PradeshChandrababu in Uravakonda : ఉరవకొండలో చంద్రబాబు పర్యటన.. సీమకు రూ.12,400 కోట్లు!

Chandrababu in Uravakonda : ఉరవకొండలో చంద్రబాబు పర్యటన.. సీమకు రూ.12,400 కోట్లు!

Chandrababu in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గత ఐదేళ్లు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ రోడ్డుకైనా మట్టి, గుంతలు పూడ్చారా? అని ప్రశ్నించారు. 2014-19లో ఇరిగేషన్ మీద రూ.70వేల కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమలోనే రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు (Chandrababu in Uravakonda) స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

హంద్రీనీవాకు రూ. 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు దిగులుగా ఉండేవారు, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. సంక్షేమం , అభివృద్ధి ,సంపద సృష్టించి… మళ్లీ ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. 11 నెలలు అయింది. ఇంకో నెలలో సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. సూపర్ సిక్స్ చెప్పాం, తల్లికి వందనం త్వరలోనే ఇస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు కూడా ఇస్తానని హామీ ఇస్తున్నాను.

రోడ్లు గతంలో ఎక్కడా చూసినా గుంతలు , ఈరోజు బాగున్నాయి. పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు మీతోనే ఉంటా. సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడినవారు ఆలోచించాలి. ఇంకా ఎంతోమంది పేదరికంలోనే ఉన్నారు. పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకు తమ పరిధిలో చేయూత ఇవ్వాలి. కిందిస్థాయిలో ఉన్న 20 శాతం మందికి అండగా ఉందాం. సూచనలు, సలహాలే కాదు. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం. పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి ఉండకూడదు.

అండదండలు లేక ఎంతోమంది యువత కూలీలుగా మారుతున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదు. పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు మీతోనే ఉంటా. కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలం. వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చాం.

మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ సరిగా వాడుకుంటే మనం ముందుకెళ్లగలం. మీ భూముల్లో ఏయే పంటలు పండుతాయో తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది. దొంగలు… దొంగతనాలు చేసి ఆడబిడ్డలమీద కు వస్తే ఖబడ్దార్ జాగ్రత్త సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉన్నాయి. నేరాలు చేసి ఎవరూ తప్పించుకోలేరు. ఒకప్పుడు మీటింగ్ అంటే.. పరదాలు, బారికేడ్లు ,చెట్లు నరికేవారు.. ఇప్పుడు నేను ఆ పని చేయడం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Chandrababu: శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు
Chandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు
Chandrababu: ఆంధ్రా ఎస్కోబార్.. రోడ్లన్నీ నాశనం చేశాడు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు