Chandrababu: శ్రీశైలం – హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు.
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను తొలిగించాలని సూచించారు.
ఇవీ చదవండి: Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
State Entry Road: ఏపీ స్టేట్ రోడ్లపై టోల్ ట్యాక్స్.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది?
AP Roads: జనవరి కల్లా గుంతలనేవి లేకుండా చేస్తాం: CBN
256 KM Straight Road: సౌదీలో అద్భుతమైన రహదారి.. ఒక్క మలుపూ లేకుండా 256 కి.మీ. హైవే
Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
Darsi Road Accident : దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాగర్ కెనాల్‌లోకి పెళ్లి బస్సు.. ఏడుగురు దుర్మరణం
Long Drive: Long drive road trip plans for international tourists
Rushikonda: అద్భుతమైన భవనాలు కడితే దుర్మార్గం.. ఏమీ కట్టకపోతే అమోఘం!
BSNL New Logo: బీఎన్ఎన్ఎల్ కొత్త లోగోపై దుమారం.. అన్నింటా కాషాయమా!
Chandrababu: ఆంధ్రా ఎస్కోబార్.. రోడ్లన్నీ నాశనం చేశాడు
Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
