AP Liquor Scam : గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) జరిగిందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం వైయస్ జగన్ వద్ద పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. విచారణకు రావాలంటూ నోటీసులు అందించారు.
ఏపీ లిక్కర్ కేసులో హైదరాబాద్ లో 4 చోట్ల సోదాలు జరిగాయి. బంజారాహిల్స్ లోని ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో కుట్ర దాగి ఉందని సిట్ ఆరోపిస్తోంది. ముడుపులుగా రూ.3200 కోట్లు చేతులు మారినట్లు చెబుతోంది. ఈ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కీలకంగా ఉన్నట్లు సీఐడీ చెబుతోంది. భారతి సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప లిక్కర్ విధానంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరు అనుకున్నట్టుగానే లిక్కర్ పాలసీని తీసుకొచ్చినట్లు సీఐడీ చెబుతోంది. ధనుంజయ రెడ్డి ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేసి ఇప్పటికే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ సరఫరాదారుల నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముడుపుల రూపంలో డొల్ల కంపెనీలకు బదిలీ చేసినట్లు సీఐడీ చెబుతోంది. పర్సెంటేజ్ లపై చర్చించేందుకు హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం యజమానులతో చర్చించినట్లు ఆరోపణలున్నాయి.
ఏపీ మద్యం కేసులో నిందితులకు సిట్ నోటీసులు
హైదరాబాద్ లోని నిందితుల ఇళ్లకు వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, రోహిత్ రెడ్డికి నోటీసులు అందించారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. విచారణ కోసం విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ధనుంజయరెడ్డి లేకపోవడంతో ఇంటికి నోటీసులు అతికించి అధికారులు వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: AP Liquor Scam: లిక్కర్ స్కాం కూటమి సర్కార్ సృష్టంచిన బేతాళ కథ
AP Liquor rates: ఇదే మందు.. అప్పుడు విషం, ఇప్పుడు అమృతమా?
AP Cheap Liquor: రూ.99 మద్యం కాంట్రాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
