HomeAndhra PradeshChandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు

Chandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు

chandra babu naidu latest news: పోలవరం ప్రాజెక్ట్ లో గత జగన్ సర్కార్ తప్పిదాలే శాపంగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కంటిన్యూగా అధికారంలో ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. కక్షతో, మూర్ఖత్వంతో జగన్ ప్రభుత్వం పోలవరాన్ని ఆపేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ఇవాళ ప్రసంగం చేశారు. పూర్తి వివరాలు ఇవీ.. (chandra babu naidu latest news)

‘‘అన్నింటికంటే ముఖ్య‌మైన స‌బ్జెక్టు సాగునీటి రంగం. నేను 45 ఏళ్ల నుంచి చూస్తున్న‌కాంప్ర‌హెన్సీవ్‌గా స‌బ్జెక్టు తెలిసిన వాళ్లు ఐదారుమందికి త‌ప్ప ఎవ‌రికీ కాంప్ర‌హెన్సీవ్‌గా స‌బ్జెక్టు తెలియ‌దు. మ‌న రాష్ట్రానికి వ‌స్తే ప్ర‌ధానంగా అనేక న‌దులు ఉన్నా.. కృష్ణ‌, గోదావ‌రి, వంశ‌ధార‌, పెన్నా ఉన్నాయి. పోల‌వ‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జీవ‌నాడి

ఇది స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేసుకోగ‌లిగితే..అక్క‌డి నుంచి న‌దుల‌ను అనుసంధానం జ‌రిగ‌గ‌లిగితే క‌రువును నివారించ‌వ‌చ్చు. క‌రువును నివారించ‌గ‌లిగితే బంగారం పండించే రైతులు ఉన్నారు. పెట్టుబ‌డులు వ‌స్తాయి. తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. ఈస్ట్‌, వెస్ట్ గోదావ‌రిలో చేప‌ల చెరువులు వ‌చ్చిన త‌ర్వాత కలుషిత నీళ్లు తాగాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. (chandra babu naidu latest news)

పోల‌వ‌రం 1941లో ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది. దివాన్ బ‌హుదూర్ ఎన్. వెంక‌ట కృష్ణ‌య్య‌న్ అప్ప‌టి చీఫ్ ఇరిగేష‌న్‌. ఒక స్టోరేజీ రిజ‌ర్వాయ‌ర్ ఇక్క‌డ వ‌స్తే బాగుంటుంద‌ని చెప్పారు. గోదావ‌రిపైన రావాల‌ని ఆలోచించి అప్ప‌ట్లోనే జీవో కూడా ఇచ్చారు. 170 అడుగుల ఎత్తు క‌ట్టాల‌ని, అక్క‌డి నుంచి 208 అడుగులు పెట్టాల‌ని, 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు అక్క‌డ నీళ్లు ఉంటాయ‌ని అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు అనుకున్నారు. పేరు కూడా రామ‌పాద సాగ‌ర్ అని సైట్‌ను గుర్తించి అక్క‌డ ప్రాజెక్టు క‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప్రాజెక్టును గోవింద రాజు అయ్యంగార్ అని ఆగ‌స్టు 1947లొ ఇది మంచి సైట్ అని ఫైన‌లైజ్ చేశారు.

ఆ రోజు పోల‌వ‌రం పూర్తి అయింటే ఎస్ ఎస్ ఆర్ 47, 48 ప్ర‌కారం 129 కోట్లు. ఈ రోజు 55వేల కోట్లు అంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయింటే రాష్ట్రం ఎంత సుభిక్షం అయ్యేదో ఒక ఉదాహ‌ర‌ణ‌. దాని త‌ర్వాత చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.. 15-5-1981లో అంజ‌య్య‌గారు ఫౌండేష‌న్ వేశారు. ప్రాజెక్టు ఏమీ స్టార్ట్ చేయ‌లేదు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌చ్చాక దాన్నిఎన్ని ఇబ్బందులు పెట్టాల్నో అన్ని ఇబ్బందులు పెట్టి అస్త‌వ్య‌స్తం చేసి ఇది అసాధ్యం అనే ప‌రిస్థితికి వ‌చ్చారు. (chandra babu naidu latest news)

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఆదాయం లేదు.. కాబ‌ట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయ‌ల‌నే ఉద్దేశంతో పోల‌వ‌రాన్ని నేష‌న‌ల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. అమ‌రావ‌తి, పోల‌వ‌రం ఈ రెండూ మ‌న‌కు రెండు క‌ళ్లుగా తీసుకోవాల‌ని రెండింటిపైన శ్ర‌ద్ధ పెట్టాం. మూడ‌వ‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉండే పెద్ద అవ‌కాశం సీకోస్ట్‌. ఈ మూడింటిపైన దృష్టి పెట్టాం. నాకు నాలెడ్జ్ ఉంది కాబ‌ట్టి నా అనుభ‌వంతో ఆలోచించా. పోల‌వ‌రాన్ని నేష‌న‌ల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి ఇందులో ముంపున‌కు గుర‌య్యే 7 మండ‌లాల‌ను తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోక‌పోతే పోల‌వ‌రం ఎప్ప‌టికీ సాధ్యం కాదు..క‌ల‌గా మారిపోతుంద‌ని.

రాజ్‌నాథ్ సింగ్ గారి, వెంక‌య్య నాయుడిగారిని ఇద్ద‌రినీ అడిగాను. మీరు పోల‌వ‌రం 7 మండ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఇవ్వ‌క‌పోతే రేపు ఈ ప్రాజెక్టు అసాధ్యం.. ఇప్ప‌టికే న‌ష్ట‌పోయాం.. ఇంక న‌ష్ట‌పోవ‌డానికి సిద్ధంగా లేవు.. 7 మండ‌లాల‌ను ఇస్తేనే ప్ర‌మాణ స్వీకారం చేస్తాను. లేక‌పోతే ఈ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌ద్ద‌ని చాలా స్ప‌ష్టంగా చెప్పాను. పార్ల‌మెంట్ కానీ, అసెంబ్లీ కానీ ముందు మంత్రివ‌ర్గం, ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. అలాంటిది ఆ రోజు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీగారిని ఒప్పించి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన త‌ర్వాత‌నే పార్ల‌మెంట్ స‌మావేశాలు పెట్టారు. ఈ పోల‌వ‌రం సాధ్య‌మైందంటే ఎన్డీఏ స‌హాకంతోనే అయింది. (chandra babu naidu latest news)

నీతి అయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 10, 20, 30 ఏళ్లు అవుతున్నాయి.. ఇది కూడా ఆ కోవ‌కే ప‌రిమితం అవుతుంది.. ఆంధ్రప్ర‌దేశ్ కు ఇస్తే వాళ్లు త్వ‌ర‌గా పూర్తి చేసుకుంటార‌ని రెక‌మండ్ చేశారు. అది కేబినెట్ కు వెళ్లి.. సెంట్ర‌ల్ కేబినెట్ ఆమోదించిన త‌ర్వాత నేను కూడా ఇది పూర్తి చేయాల‌నే ఉద్దేశంతో తీసుకున్నా. రైట్ మెయిన్ కెనాల్ పూర్తి అయింది.. పోల‌వ‌రం ఇంకా పూర్తి కావాలి. చాలా కోర్టు కేసులు ఉన్నాయి.. 3, 4 ఏళ్లు ప‌డుతుంది అని, ప‌ట్టిసీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ పెట్టి.. 100 టీఎంసీలు నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకువ‌చ్చి రెండు న‌దుల అనుసంధానం చేశాం.

ప‌ట్టిసీమ ఒక సంవ‌త్స‌రంలో పూర్తి చేశాం. ఆ నీళ్ల‌ను పొదుపు చేసి రాయ‌ల‌సీమ‌కు నీళ్లు ఇచ్చాం. 20 ఏళ్ల క్రితం అనంత‌పురంలో పెద్ద క‌రువు వ‌చ్చింది.. ప‌శువుల‌కు కూడా క్యాంపులు పెట్టాం. గ‌డ్డితీసుకుపోయాం. మొద‌టి సారి అనంత‌పురం జిల్లా వేదిక‌గా ఇన్‌పుట్ స‌బ్సిడీ ఒక‌టి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది తెలుగుదేశం పార్టీ. కియో మోటార్స్ వాల్లు నీళ్లు లేవంటే హంద్రీనీవా ద్వారా గొల్ల‌ప‌ల్లి రాజ‌ర్వాయ‌ర్ క‌ట్టి ఆ నీళ్లు తీసుకువ‌చ్చిన త‌ర్వాత కియో మోటార్స్‌ను కూడా ప్రారంభించాం. (chandra babu naidu latest news)

2014-19 ప్రాజెక్టును ప‌రుగెత్తించాం. ఏ విధంగా పూర్తి చేయాల‌ని నేను అనునిత్యం ఆలోచించేవాడిని. ఒక్క రోజులో స్పిల్ చాన‌ల్ కోసం 32,215 క్యూబిక్ మీట‌ర్లు కాంక్రీట్ చేసి గిన్నీస్ రికార్డ్ చేశాం. ప్రాజెక్టులో కీల‌క‌మైన డ‌యాఫ్రంవాల్ 2 కిలోమీట‌ర్ల పొడ‌వు.. 100 మీట‌ర్ల లోతులో ఇది జ‌ర్మ‌న్ కంపెనీ బాబ‌ర్ ను ర‌ప్పించి 414 రోజుల్లో డ‌యాఫ్రం వాల్ పూర్తి చేశాం.

స్పిల్ వే గేట్లు సిద్ధం చేశాం. ఇవ‌న్నీ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ముందుకు పోయాం. 72 శాతం ప‌నులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్లాను. 82సార్లు వ‌ర్చువ‌ల్ గా రివ్యూ చేశాను. కేంద్రం డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా మ‌న డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టాం. 2019లో టీడీపీ కొన‌సాగి ఉంటే 2021కి పూర్తి అయి జాతికి అంకితం అయ్యేది. 2019లో ప్ర‌భుత్వం మారింది. అక్క‌డి నుంచి రివ‌ర్స్ టెండ‌రింగ్‌.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తూనే పోల‌వ‌రం ప్రాజెక్టును ఆపేస్తున్నాన‌ని అనౌన్స్ చేయ‌డం.

2019 జులై 29న నోటీసులు ఇచ్చి సైట్ లో నిర్మాణ సంస్థను ఖాళీ చేయించారు. ఇంకో పక్క అధికారులందరినీ మార్చేశారు. అధికారులు లేరు.. కాంట్రక్టర్ లేడు..గోధావరి ఉద్ధృతంగా వస్తే.. 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దేశంలో ఇంత ప్రమాదకరమైన నదీ ఏదీ లేదు. అందుకే అంతపెద్ద మొత్తంలో నీరు పోవడానికి స్లూయిజ్ నిర్మాణాన్ని చేపట్టాం. అంటే అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, నిర్లక్ష్యం. ఏదో జరిగిపోయిందని, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టును నాశనం చేసే పరిస్థితికొచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవరూ పెద్ద దిక్కు లేరు. 20లో ఆగస్ట్ – అక్టోబర్ లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.

వరదనీళ్లు డయాఫ్రం వాల్ పైన వెళ్లాయి. దాంతో డయా ఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. దానిని గుర్తించలేకపోయారు. పైనేమీ కనిపించదు వీళ్లకి.. కింది భాగంలో దెబ్బతింది. అది కనబడకపోతే.. దీన్ని అలా చేస్తే.. చివరికి అసమర్థత, కుట్లల విధానంతో ఐదేళ్లు మనం కష్టపడింది నాశనమైపోయింది. పీపీఎల్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు రివర్స్ టెండరింగ్ కు వెళ్లితే..రేపు జరగరానిది జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు? కొత్త కాంట్రాక్టరా? పాత కాంట్రాక్టరా? సరైన నిర్ణయం కాదు.. తొందరపాటు తగదు..పెండింగ్ పెట్టండని సూచిస్తే.. పీపీఏకి కూడా చెప్పకుండా, ఆ రోజు నిర్ణయం చేసి ర్యాటిఫికేషన్ కోసం పీపీఏకి పంపించారు. (chandra babu naidu latest news)

ఏం చేయాలో తెలియక వారు వదిలేసే పరిస్థితికి వచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్.. ఐఐటీ హైదరాబాద్ వాళ్లని పంపించారు. వారు ప్రాజెక్టును పరిశీలించి డయాఫ్రంవాల్ దెబ్బతిందని వెల్లడించారు. తర్వాత తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించింది. నాలుగు చోట్ల దెబ్బతిందని తేల్చారు. వాటికి రీపేర్లు చేయాలంటే రూ.490 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ గ్యారంటీ లేదు.. కడాన ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో కొత్త డయా ఫ్రం వాల్ కట్టాలని సూచించారు.

కొత్త డయా ఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే.. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనన రాష్ట్రానికి శాపంగా మారే పరిస్థితి వచ్చింది. ఈ రూ.990 కోట్లు ఒకప్రక్క.. ప్రాజెక్టు డిలే కావడంతో మరోవైపు ఎస్టిమేషన్స్ పెరిగాయి. కొన్నివేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. 2019 నాటికి మేము 70.93 శాతం పూర్తి చేశాం.. వీళ్లు 3.84 శాతం మాత్రమే పూర్తి చేశారు.. గతంలో ఒక మంత్రి ఇదే అసెంబ్లీలో పర్సెంటా.. హఫ్ పర్సంటా.. తొందరెందుకు అని అపహాస్యం చేస్తాడు. తర్వాత ఇంకొకాయన వచ్చాడు.. ఆయనకు టీఎంసీలకు, క్యూసెక్కులకు తేడా తెలీదు. ఆయనొక మంత్రి..నేర్చుకోవాలన్న ధ్యాస లేదు..అవన్నీ మాట్లాడకూడదు.. నాకు సభ్యతుంది.. సభలో హుందాతనాన్ని పాటిద్దాం.

కడాన.. రూ.16,493 కోట్లు మేము ఖర్చు చేస్తే.. వాళ్లు రూ.4900 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీరు మనం పొదుపుచేసుకునేవాళ్లం.రిజర్వాయర్ లో నీరు నింపుకునేవాళ్లం. కృష్ణా, ఈస్ట్రన్ డెల్టాకు 100 టీసెంసీలు తీసుకువెళ్లేవాళ్లం.. నాగార్జున సాగర్ కు తీసుకువెళితే 150 టీఎంసీ.. రాయలసీమకు తీసుకువెళితే అక్కడ అన్ని రిజర్వాయర్లలో నీరు నింపుకునే పరిస్థితి వచ్చేది. అంటే ఈ అసెంబ్లీలో ఎన్ని విపరీతంగా.. గోదావరి నుంచి నీళ్లు తెస్తామన్నారు..గోదావరి పై నుంచి నీళ్లొచ్చి శ్రీశైలం వేసేసి..ఆ నీళ్లను తీసుకువెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే..నేను ఎగతాళి కూడా చేశాననుకుంటా ఆరోజు.

అసెంబ్లీకి కూడా నీళ్లొచ్చాయి… భయమేస్తోంది.. వరదలొచ్చాయని.. ఆ రోజు నేను చెప్పాను అధ్యక్షా…అవగాహన లేకపోతే నేర్చుకోండంటే.. అవహేళన చేశారు నన్ను. తెలుగు గంగకు కనీసం 5 టీఎంసీల నీళ్లివ్వాలి..ఒక ప్రధాని ఇందిరా గాంధీ .. ముగ్గురు సీఎంలు కలసి ఒప్పుకున్నారు..ఎన్టీఆర్ నాయకత్వంలో.. ఎంజీఆర్ కూడా వచ్చారు. ఈ రోజుకీ 5 టీఎంసీల నీరు ఇవ్వలేకపోయాం. వాస్తవంగా శ్రీశైలం నుంచి భూగర్భ పైప్ లైన్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీరివ్వాలని ప్రతిపాదన. కానీ ఆ రోజు ఎన్టీరామారావుగారు.. కరువు సీమ రాయలసీమకు నీరివ్వకుండా తమిళనాడుకి నేను నీళ్లివ్వనని స్పష్టంగా చెప్పారు..

నేను చెన్నైలో ఉన్నా.. ఆ ప్రాంతం పట్ల అభిమానం ఉంది.. నీళ్లివ్వాలి..అక్కడికి పోయేటప్పడు రాయలసీమకు నీళ్లిచ్చుకుంటూ పోతానని చెప్పి.. ఓపెన్ కెనాల్ నిర్మించి తమిళనాడుకు నీరిచ్చారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా.. వాటిని తెలుగుదేశం చేసిన ప్రాజెక్టులు.. ఉత్తరాంధ్ర మొదలుకుని,.రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టులు చూసినా.. వెలుగొండకు నేనే శంకుస్థాపన చేశా.. దానిని నేనే ప్రారంభిస్తా.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు.. 45.72 మీటర్లకు కట్టుబడి ఉన్నాం.. ఇటీవల చూస్తున్నా. ప్రాజెక్టు ఎత్తు చూస్తే..45.72 మీటర్లు..అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని 41.15కి ఒకే అని చెప్పి ఆ ప్రాజెక్టును ఫేజ్ కింద ఒకే చేశారు. ఇది కేంద్ర ప్రాజెక్టు.. 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి.. ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రం కూడా 45.72 మీటర్లకు కట్టుబడి ఉంది. కావాలని ప్రతి రోజూ మాట్లాడుతున్నారు.. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. రూ.55 వేల కోట్లు ప్రాజెక్టుకు..ల్యాండ్ అక్విజేషన్, ఆర్అండ్ ఆర్ కు ఖర్చవుతుంది. దీని వల్ల 350 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం వస్తుంది. కుడికాలువద్వారా 3,20,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 4,00,000 ఎకరాలు.. మొత్తం 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. 24 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. 80 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్టాకు తరలించే అవకాశం వస్తుంది. 23.44 టీఎంసీల నీటిని శాఖకు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు తరలించే అవకాశం వస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. 540 గ్రామాలకు 20 లక్షల మందికి తాగునీరు అందించగలుగుతాం.

నిర్దిష్ట గడువులోపు పోలవరం పూర్తి చేస్తా.. సీఎంగా అవగానే నేను పోలవరాన్నే సందర్శించా.. రూ.12,157 కోట్లు కేంద్రం రెండేళ్లలో ఇవ్వడానికి అంగీకరించింది. 2,300 కోట్లు విడుదల చేశారు. 460 కోట్లు రీయింబర్స్ చేశారు. 2900 కోట్లు డబ్బులు వచ్చాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.. సాంకేతిక సమస్యలపై విదేశీ నిపుణులతో చర్చించాం.. కొన్ని ఆదేశాలు ఇచ్చారు.. కొత్త డయా ఫ్రంవాల్, ఈసీఆర్ ఎఫ్ డ్యామ్ ను ఒకేసారి నిర్మించుందుకు అంగీకరించారు. కొత్త డయా ఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభిస్తారు.

ఇవీ చదవండి: Polavaram Project: చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం
Polavaram: పోలవరాన్ని 41.15 మీటర్లకు కుదించి బ్యారేజీగా మార్చే కుట్ర
Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్‌ ఫైర్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు