HomeAndhra PradeshAccreditation Card: ఏపీలో జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లకు ఐడీ కార్డులపై రగడ?

Accreditation Card: ఏపీలో జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లకు ఐడీ కార్డులపై రగడ?

Accreditation Card: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఐదేళ్లలో వారికి అనుకూలమైన జర్నలిస్టులకు (Accreditation Card) మేలు చేకూరుస్తూ కార్పొరేషన్ల ద్వారా జీతాలు ఇప్పించి, అక్రిడిటేషన్ గుర్తింపు కార్డులిచ్చారని ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశమైంది.

జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లుగా పని చేసిన అనుభవం ఉన్న వారిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుని, కార్పొరేషన్ల ద్వారా వేతనాలు చెల్లించి వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులిచ్చారని, ప్రభుత్వాన్ని పొగడటానికి, ప్రతిపక్షాన్ని తిట్టడానికి వీరిని నియామించుకున్నారన్నది ప్రస్తుత ప్రభుత్వంలోని నాయకుల ప్రధాన ఆరోపణ.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, మీడియా సంస్థలకు సమాచారాన్ని చేరవేసేందుకు పీర్వోల వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఇందులో పలు పత్రికలు, టీవీ చానళ్లలో పని చేసిన అనుభవం ఉన్న వారు, డిజిటల్ మీడియాలో అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తుంటాయి.

వాస్తవానికి గత ప్రభుత్వంలోనే కాదు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో దాపరికానికి తావు లేదని, ఇప్పటి ప్రభుత్వంలోనూ తమకు అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థల్లో పని చేసిన జర్నలిస్టులను నియమించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మీడియా ప్రతినిధులు సంస్థలను మారడం సహజంగా జరిగేదే. అందులో భాగంగా ఏపీలో ఈనాడు మొదలుకొని సాక్షి, ఆంధ్రజ్యోతి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పని చేసిన వారు అటూ ఇటూ మారడం జరుగుతుంటుంది. వీరికి ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో పీఆర్వోలుగా, కంటెంట్ రైటర్లుగా, కెమెరామెన్లుగా, సోషల్ మీడియా విభాగంలోనూ, మంత్రుల పేషీల్లోనూ నియమాకం చేయడం సర్వ సాధారణ విషయం.

కానీ గత ప్రభుత్వంలోనే సాక్షిలో పని చేసిన వారికి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నది సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం. ఐడీ కార్డులివ్వడం కూడా అత్యంత సాధారణమైన విషయం అని, దీనిపై రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సబబు కాదని సీనియర్ జర్నలిస్టులు హితవు పలుకుతున్నారు. ఏమైనా ఉంటే రాజకీయంగా కొట్లాడుకోవాలని, జర్నలిస్టులపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు
Journalist Houses: జర్నలిస్టులకు సీఎం జగన్‌ తీపికబురు.. అక్రిడేషన్‌ కలిగిన అందరికీ 3 సెంట్ల స్థలం
AI Anchor: అదరగొడుతున్న ఏఐ యాంకరమ్మ.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టిందా?
Jagan Press Meet: మారిన జగన్.. ఇకపై రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు? సర్కారుపై ఏమన్నారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు