Journalist Houses: ఆంధ్రప్రదేశ్‌లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసింది ఏపీ సర్కార్. జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుతున్న సందర్భంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (Journalist Houses)
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాలయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజనకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు ప్రకటించిన డీఏకు ఆమోదం తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిషికేషన్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశ్వ విద్యాలయాల్లో 3200 ఉద్యోగాల నియామకంపై నిర్ణయం తీసుకున్నారు.
మీడియాతో మంత్రి చెల్లుబోయిన ఏమన్నారంటే..
* భూమిలేని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం
* ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రూ.5 వేల కోట్ల రుణ మంజూరుకు ఆమోదం
* పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
* ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
* కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం
* జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు
* జగనన్న సురక్ష ద్వారా 11,700 క్యాంపులు నిర్వహించాం
* 8 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు
* ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
* ఆరోగ్యశ్రీ వినియోగించడంపై మరింత అవగాహన కల్పించాలని నిర్ణయం
* 6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్ పై బోధన
* దీనికోసం మ్యాపింగ్ చేయనున్న ఇంజనీరింగ్ కాలేజీలు
* ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు మినహాయింపు
* దీంతో ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం
* క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం
* కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం
* అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన ఉపయోగపడుతుంది
* సామాజిక అభివృద్ధికి కులగణన ఉపయోగపడుతుంది
* కులగణనతో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి
* జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం
* ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
* సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు
* జర్నలిస్టుల తరపున సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నా.