AI Anchor: అదరగొడుతున్న ఏఐ యాంకరమ్మ.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టిందా?

AI Anchor: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో అన్ని రంగాల్లోనూ ఓవైపు కొత్త ఆశలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఎన్ని ఉద్యోగాలు పోతాయోనన్న భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జర్నలిస్టుల ఉద్యోగాలకు ఏఐ ఎసరు పెట్టిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఏఐ ఆధారిత మార్పులు జర్నలిజంలోనూ వస్తున్నాయి. మనదేశంలో తొలిసారిగా “కృత్రిమ మహిళా యాంకర్‌” దర్శనమిచ్చింది. దీంతో టీవీ యాంకర్‌ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్లయింది. ఒడిశా రాష్ట్రంలోని ఓ మీడియా సంస్థ లీసా అనే పేరుతో మొదటి ఏఐ యాంకర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. (AI Anchor)

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వదిలారు. దీంతో ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఒడిశాలోని ఓ టీవీ న్యూస్ ఛానల్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మహిళ న్యూస్ యాంకర్ లీసాను పరిచయం చేసింది. ఆ యాంకర్‌ న్యూస్‌ చదవడం మొదలు పెట్టింది. అచ్చమైన సంప్రదాయంలో చీరకట్టుతో లీసా తెరపై కనిపించింది. అంతే కాదు.. అలవోకగా వార్తలు చదివేస్తోంది. ఈ యాంకరమ్మను చూసిన నెటిజన్లు ఔరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాయంతో లేడీ యాంకర్‌ను తలపించేలా వార్తలను చదవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు విశ్లేషకులు. ఒడియాతో పాటు ఆంగ్లంలోనూ వార్తలు చకచకా చదివేసేలా లీసాను ప్రోగ్రామ్ చేసినట్లు సంస్థ ఎండీ జాగి మంగత్ పాండా పేర్కొన్నారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే ఫోకస్‌ పెట్టినట్లు ఆయన వివరించారు.

ఎన్ని ఉద్యోగాలు పొట్టనపెట్టుకుంటుందో…

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో చాలా ఉద్యోగాలు ఊడుతాయని ఇప్పటి నుంచే భయాందోళన నెలకొంది. సాఫ్ట్‌ వేర్ రంగంలో కూడా 30 శాతం పనులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేస్తుందనేది తాజాగా వస్తున్న ఓ అంచనా. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి.. తీవ్రమైన కరువు రాబోతుందనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. సమాజంలో ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరో వైపు పనులు చేద్దాం అంటే ఉద్యోగాలు ఉండవంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యంత్రాలు ప్రతి రంగంలోనూ ఎంట్రీ ఇచ్చేశాయి. ఎక్కువ పనులు మెషీన్లు చేసేస్తున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు. అంటే ఒక 10 నుంచి 20 ఏళ్లలో మనుషులు 5 రెట్లు ఎక్కువ ఉంటారని చెబుతున్నారు. తిండి మాత్రం 40 శాతం జనాభాకు మాత్రమే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగాలు లభించడం మరింత కష్టమవుతుందంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కొందరు మేధావులు, డబ్బున్న వారు ఇంకా సంపాదించాలనే కోరికతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి వాటికి పెద్దపీట వేస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు.

భవిష్యత్‌లో మన పిల్లలకు ఉద్యోగాలు రావడం చాలా కష్టతరమవుతుందంటున్నారు. డబ్బున్న వారు మాత్రమే సేవింగ్స్‌ ఇంకా పెంచుకొని, తన పిల్లలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచన చేస్తారని, ఇది పేద వారికి పెద్ద శాపంగా మారే చాన్స్‌ ఉందంటున్నారు.

Read Also : Facebook Twitter: ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సంక్షోభంలో ఉన్నాయా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles