Tilak Varma: తెలుగు కుర్రాడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఐసీసీ తాజా టీ20 ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌ను బుధవారం రిలీజ్ చేసింది. ఆల్ రౌండర్ల విభాగంలో యాట్యిట్యూడ్ స్టార్ హార్దిక్ పాండ్య టాప్ ప్లేస్ ను చేరాడు. మరోవైపు టీమిండియా యంగ్ బాయ్, తెలుగబ్బాయి తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎక్కేశాడు. సూర్యను వెనక్కు నెట్టాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్న హార్దిక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించాడు. దీంతో పాండ్యా మళ్లీ నంబర్‌వన్ ప్లేస్ ఆకుపై చేశాడు. హార్దిక్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్ ర్యాంకును ఆక్రమించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రీసెంట్ గా ముగిసిన T20 సిరీస్‌లో హార్దిక్ పాండ్య అటు బ్యాట్, ఇటు బాల్ రెండింటితోనూ సత్తా చాటాడు.
మెరుపు షాట్లు, అద్భుత బౌలింగ్ తో వికెట్లు పడగొట్టి మైమరపించాడు. ముఖ్యంగా సఫారీలతో జరిగిన రెండో టీ20లో క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ 39 పరుగులతో రాణించడం టీమిండియాకు దోహదపడింది. దీంతోపాటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ కష్టం ఉంది. వీటి కారణంగానే హార్దిక్ టాప్ ప్లేస్ లోకి వెళ్లగలిగాడు.
రీసెంట్ గా ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన యువ ప్లేయర్ తిలక్ వర్మ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ -5లోకి ఎగబాకాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు 72వ ర్యాంక్ లో ఉన్న అతగాడు.. ఇప్పుడు ఏకంగా థర్డ్ ప్లేస్ లోకి రావడం విశేషం. సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్రికాపై 107 పరుగులతో తిలక్ సత్తా చాటాడు.
అనంతరం జోహన్నెస్‌బర్గ్‌లోనూ జోరు కొనసాగించి 120 పరుగులతో తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 20 సిక్స్‌లు, 21 ఫోర్లతో 140 సగటుతో 280 పరుగులు చేయడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తిలక్ వర్మ కంటే దిగువకు చేరాడు. ప్రస్తుతం సూర్య 4వ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
ఇవీ చదవడి: Surya: సీఎస్కే స్టార్ బ్యాటర్‌పై సూర్యకుమార్ హాట్ కామెంట్స్!
Surya Kumar Yadav: స్కై ఈజ్ ద లిమిట్.. మార్కెట్లోనూ దంచేస్తున్న సూర్యకుమార్ యాదవ్
Tilak Varma: నా త్యాగం అద్భుతాలు సృష్టించింది: సూర్య
RCB: బ్యాటింగ్ కోచ్‌గా గుజరాత్ టైటాన్స్‌లోకి మాజీ RCB, CSK, MI స్టార్!
