మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపించే మిస్టర్ 360.. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) . టీ20 వరల్డ్ కప్ లో అపోజిషన్ జట్టు బౌలర్లను తికమక పెట్టాడు. అది పేసర్ అయినా, స్పిన్నర్ అయినా.. లెఫ్ట్ కి కొడతాడో, మిడ్ ఆన్ కు మళ్లిస్తాడో, స్క్వయర్ లెగ్ వైపు సిక్సర్ గా పంపిస్తాడో తెలీదు.. ఏ బౌలరైనా లెక్కచేయడు.. మైదానంలో 360 డిగ్రీల్లోనూ బాదుడే బాదుడు.. ఇదీ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) బ్యాటింగ్ శైలి. తాజాగా ఐపీఎల్‌లో మొదటి ఐదు మ్యాచ్‌లలో చతికిలబడిన సూర్య.. (Surya Kumar Yadav) తర్వాత మ్యాచ్‌లలో చితక్కొట్టేస్తున్నాడు.
అటు టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ పోషించాడు. ఓపెన్లు ఫెయిలైన సందర్భాల్లో వన్ డౌన్ లో లేదా టూడౌన్ లో వస్తూ టీమిండియాకు ఓ వజ్రాయుధంలా దొరికాడు సూర్య. మైదానంలోనే కాదు.. అటు బయట కూడా సూర్య కుమార్ యాదవ్ కాసుల వర్షం కురిపిస్తున్నాడు. సూపర్బ్ ఫామ్ లో ఉన్న సూర్యకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. భారీ బ్రాండ్ల ప్రమోటర్ గా మారుతున్నాడు సూర్య. తాజాగా అతడు కుదుర్చుకున్న పెద్ద బ్రాండ్ల డీల్ సంఖ్య 20కి చేరింది.
ప్రస్తుతం సూర్య 10 బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. డ్రీమ్ 11, ఫార్మా హెల్మెట్ లాంటి బ్రాండ్లలో ఇప్పుడు కనిపిస్తున్నాడు సూర్య. రానున్న కాలంలో సూర్య వివిధ మొబైల్ బ్రాండ్లు, మీడియా, స్పోర్ట్స్, ఫారిన్ బ్రాండ్లలో కూడా పాలు పంచుకొనే వీలుందని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అటు మైదానంలోనే కాదు.. ఇటు మార్కెట్ లోనూ సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోతున్నాడు.
గతంలో సూర్య రోజుకు సుమారు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవాడట. ఇప్పుడది రోజుకు 65 లక్షల రూపాయల నుంచి 70 లక్షల దాకా వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల కూడా ఓ ఆరేడు బ్రాండ్లు సూర్యను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారని టాక్ నడుస్తోంది.
అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు సాధించినా.. ఇప్పుడు ఐపీఎల్‌లో (IPL) తొలి సెంచరీ సాధించడం తనకెంతో ప్రత్యేకమేనని సూర్య తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌పై 49 బంతుల్లో 103 పరుగులు చేసిన సూర్య.. తన ఫాం లేమికి చెక్ పెట్టాడు. మైదానం నలువైపులా బౌండరీలతో ‘మిస్టర్ 360’ మరోసారి రెచ్చిపోయాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
How do you hit a cover drive but get it over third man for six?
We watched SKY do it here and still can't understand. What about you? 😵💫#IPLonJioCinema #MIvGT pic.twitter.com/kg9QU7jxuW
— JioCinema (@JioCinema) May 12, 2023
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. చాలా ఆనందంగా ఉందన్నాడు. కుటుంబమంతా ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిందని తెలిపాడు. మరీ ముఖ్యంగా దేవీషా కూడా ఇక్కడే ఉందని, తాను చేసిన మూడు అంతర్జాతీయ సెంచరీలను ఆమె చూడలేకపోయిందన్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఆమె చూస్తుండగానే శతకం బాదడం మరింత హ్యాపీగా ఉందని సూర్య పేర్కొన్నాడు. తన సతీమణి ఉంటే మూడంకెల స్కోరు సాధించలేనని వ్యాఖ్యానించే వారికి చెక్ పెట్టానని చెప్పాడు.
From bringing up Maiden IPL Century with a stylish Maximum to scalping a skilful 3️⃣-wicket haul 👏🏻👏🏻
Akash Madhwal & SKY relive @mipaltan's bright win at home 😃👌🏻 – By @Moulinparikh
Full Interview 🎥🔽 #TATAIPL | #MIvGT | @surya_14kumar https://t.co/s8BT1p0QTa pic.twitter.com/q7EIpSMZJA
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..