Kadapa: కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి దురాగతాలపై 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తగిన చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, దువ్యారపు రామారావు, బి.తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. (Kadapa)
‘‘కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి అక్రమాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేయడం జరిగింది. పలు అక్రమాలు నిర్థారణ అయ్యాయి. 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తప్పని సరిగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కడప ప్రాంతీయ విద్యాశాఖ డైరెక్టర్ గా అనేక సంవత్సరాలు రాఘవరెడ్డి పనిచేశారు.
విద్యాశాఖలో పనిచేసేవారు సమాజానికి మంచి విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పించాల్సిందిపోయి రాఘవరెడ్డి సంస్కారహీనంగా వ్యవహరించారన్నారు. ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా ధూషించేవారు. విద్యార్థుల ముందే టీచర్లను అవమానకరంగా మాట్లాడేవారన్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు చేయడం, ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ అధికారిగా ప్రసన్న కుమార్ ను నియమించగా.. రాఘవరెడ్డి చేసిన నేరాలు-ఘోరాలపై ఫిర్యాదుచేసేందుకు వెళ్లినవారిపై గూండాలతో దాడి చేయించారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి అధికారులు విద్యావ్యవస్థలో కొనసాగేందుకు అనర్హులు.’’ అని లోకేష్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Lokesh Red Book: రెడ్ బుక్‌లో మూడో ఛాప్టర్ త్వరలోనే ఓపెన్ చేస్తాం
Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: వైకాపా వాళ్లు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు: లోకేష్
Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా: లోకేష్
