AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. నిన్న ఎస్ఐపీబీలో ఆమోదించిన అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. 10 కంపెనీలకు చెందిన రూ.85వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతికి గతంలో ఇచ్చిన నిర్మాణ పనుల టెండర్ల రద్దుకు కేబినెట్ లో చర్చ జరిగింది. కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై చర్చించి ఆమోదం తెలిపింది. భవన నిర్మాణ అనుమతులను అర్బన్ అథారిటీ నుంచి తొలగించడంపై చర్చ జరిగింది. ఇక నుంచి నిర్మాణ అనుమతి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే ఇచ్చేలా చట్టసవరణ చేయనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మాన గడువు తగ్గింపుపై చర్చ జరిగింది. నాలుగేళ్లు ఉన్న గడువును రెండున్నరేళ్లకు కుదించేలా చట్టసవరణపై చర్చ జరిగింది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేబినెట్ లో చర్చించారు. ఈ ప్రాజెక్టులను వందశాతం కేంద్రమే భరించేలా కేబినెట్ లో తీర్మానం చేయాలని ప్రతిపాదన చేశారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
* ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి..ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
* పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం..లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
* కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం
* ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
* అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం
* స్పోర్ట్స్, పర్యాటక పాలసీలకు ఏపీ కేబినెట్ ఆమోదం
* ఏపీ టవర్ కార్పొరేషన్ ఫైబర్ గ్రిడ్‌లో విలీనం
* కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణ
* దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా..చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఇవీ చదవండి: AP Cabinet: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. పలు పాలసీలకు ఆమోదం
CBN Cabinet: కొలువుదీరిన చంద్రబాబు కేబినెట్.. మంత్రులు వీరే
Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..
