150 Days: కూటమి ప్రభుత్వం ఏపీలో 150 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఇవాళ ప్రసంగించారు. కీలక అంశాలపై బ్రీఫింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఏమన్నారో ముఖ్యాంశాలు ఇవీ.. (150 Days)
– ఏపీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నాకు ఉంది..నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారు
– కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 150 రోజుల అవుతుంది
– 150 రోజుల్లో మా ప్రభుత్వం చేసిన పనులు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది
– గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు
– చాలా అరుదైన ఘటనలు రాజకీయ జీవితంలో చూశాను
– గత వైఎస్ఆర్ సీపీ పాలనలో నా కుటుంబంపై అవమానాలు, ఆరోపణలు చేశారు
– ఎన్నో ఇబ్బందులు పెట్టారు…జైలుకు పంపారు.నేను ఏ తప్పూ చేయలేదు
– గతప్రభుత్వ పాలనలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు-గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి.రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లింది
– అప్పులపై లెక్కలతో సహా సభలో చూపించాం
– గత ప్రభుత్వ అప్పులు, తప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి
– ఎంత తవ్వితే అన్ని అవకతవకలు బయటకు వస్తున్నాయి
– అధికారం కొత్త కాదు. కేంద్ర రాజకీయాలు నాకు కొత్త కాదు
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత టీడీపీకే దక్కుతుంది
– పేదలకు ఇళ్లు ఉండాలనే. పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుంది
– టీడీపీ పాలనలో 120 సంక్షేమ పథకాలు ప్రారంభించాం
– దేశంలో 4వేల పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీనే ..ఇప్పుడు అధికారంలోకి రాగానే పెన్షన్లు రూ.4వేలకు పెంచాం
– 64లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం
– మన కన్నా ..ధనిక రాష్ట్రాలు తక్కువ పింఛన్లు ఇస్తున్నాయి
– రాష్ట్రంలో ఒకటో తేదీనే పింఛన్ లు ఇస్తున్నాం
– నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం-ఇప్పటికే 101 అన్నా క్యాంటీన్ లు ప్రారంభించాం
– భవిష్యత్తులో మరిన్ని అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తాం
– విజయవాడ వరద సమయంలో రూ.500 కోట్లు విరాళాలు వచ్చాయి
– 3 సిలిండర్లు ఎక్కడ ఇచ్చారని కొంతమంది అడుగుతున్నారు. వెంటనే ఇవ్వడానికి ఇది క్యాష్ కాదు.
– గ్యాస్ బుక్ చేసుకున్న వారందరికీ సిలిండర్ ఇస్తున్నాం-రేషన్ కార్డ్ ఉన్న వారందరికీ ఉచిత సిలిండర్లు ఇస్తాం
– ఎవరికైనా రాకపోతే దబాయించి తీసుకోవచ్చు
– దీపం పథకం కింద ఇప్పటి వరకు 42లక్షల 40వేల మంది ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నారు
– ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది
– గత ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను గాలికొదిలేసింది.. ఆడబిడ్డలపై వేధింపులు అమానవీయం -ఆడబిడ్డల జోలికి వెళితే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా
– ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తాం..కరుడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదు.నేరాలు చేస్తే తాట తీస్తాం. ఎక్కడా రాజీపడం
– గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం-డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా పెంచాం
– డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ త్వరలో భారీ ర్యాలీ చేపడతాం-విద్యార్ధులు, యువత, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం-కబ్జా దారులను హెచ్చరిస్తున్నాం
– ఇకపై ప్రైవేటు, ప్రభుత్వ భూముల జోలికి వెళితే అంతే సంగతులు-ఈ సమావేశాల్లోనే చట్టం చేయబోతున్నాం
– గత ప్రభుత్వం లిక్కర్ పేరుతో దోపిడీకి పాల్పడింది
– భూమ్ భూమ్ బ్రాండ్లతో ప్రజలను దోచేసింది- మా ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది
– బెల్ట్ షాపు కనపడితే. బెల్ట్ తీస్తామని హెచ్చరిస్తున్నా..బెల్ట్ షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే
– బెల్ట్ షాపులు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.10లక్షలు జరిమానా
– గత ప్రభుత్వం జీవోలు దాచిపెట్టింది ..మేము అన్ని జీవోలు ఆన్ లైన్ లో పెడుతున్నాం
– ఉచిత ఇసుక అందిస్తున్నాం..గత ప్రభుత్వ ఇసుక ,మైనింగ్ వనరులను దోచుకుంది
– ఇసుకను ప్రజలకు అందనంత దూరం చేసింది
– గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ. చెత్త ఎత్తలేదు-రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది
– మేం చెత్త పన్ను రద్దు చేశాం. పేరుకుపోయిన చెత్తను తీయిస్తున్నాం
– మత్స్య కారులకు అండగా మా ప్రభుత్వం ఉంటుంది
– స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాం
– మద్యం దుకాణాల్లో 10శాతం గీత కార్మికులకు కేటాయించాం
– చేనేతకు జీఎస్టీ ఎత్తి వేశాం, పాడి రైతులకు 90శాతం రాయితీతో షెడ్లు కట్టిస్తాం
– ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం
– అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది
– అమరావతికి పూర్వ వైభవం తీసుకురావటానికి శ్రీకారం చూట్టాం
– పెట్టుబడుల ఆకర్షించడానికి చేయాల్సిన పనులు చేస్తున్నాం
– పోలవరం ఒక గేమ్ ఛేంజర్ -పోలవరం నిర్మాణానికి డబ్బులు కోరత లేదు
– పోలవరం విషయంలో రాడీపడేది లేదు..45.72మీటర్ల ఎత్తు కట్టే విధంగా పనులు చేస్తున్నాం
– రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టి వెళ్లారు-గ్రామంలో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి పుట్టే పరిస్థితి
– గుంతలు పూడ్చడానికి రూ.860 కోట్లు విడుదల చేశాం
– సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తాం
– రోడ్ల నిర్మాణానికి వినూత్న ఆలోచనతో ముందుకెళుతున్నాం
– 75వేల కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవేల పనులు జరుగుతున్నాయి
– 30 నుంచి 40వేల కోట్ల పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి
– 72వేల కోట్లతో రాష్ట్రంలో రైల్వే పనులు జరుగుతున్నాయి-అమరావతి రైల్వే లైన్ కు కూడా కేంద్రం సహకరించింది
– కేంద్రం నుంచి నిధులు వస్తే గత ప్రభుత్వం దారి మళ్లించింది
– జల్ జీవన్ మిషన్ కు కేంద్రం 45 శాతం గ్రాంట్ ఇస్తోంది
– అమృత్ కింద ఇంటింటికీ నీరు అందిస్తాం
ఇవీ చదవండి: Chandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు
Chandrababu: ఆంధ్రా ఎస్కోబార్.. రోడ్లన్నీ నాశనం చేశాడు
Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
