Laddu: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల దీనిపై జాతీయ స్థాయిలో రచ్చ జరిగింది. స్టేట్ గవర్నమెంట్ దీనిపై సిట్ విచారణ మొదలు పెట్టింది. ఇంతలో వైయస్సార్ సీపీ, ఇంకా పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అనంతరం సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ విచారణ మొదలు పెట్టింది.
తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ ప్రారంభమైంది. నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీం కోర్టు లో ఇప్పటికే వైయస్సార్ సీపీ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది.
నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీం ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా సీబీఐ నుంచి ఎస్వీ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జాయింట్ డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ) నియామకం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, గోపీనాథ్ జట్టి (డీఐజీ, విశాఖపట్నం రేంజ్)లను రాష్ట్రం నుంచి సిట్ సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ నుంచి సభ్యుడిని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ బృందం విచారణ చేయనుంది. నెయ్యి కల్తీ రేటెడ్ నమూనాలపై ప్రయోగశాల నివేదికలను సిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ విచారణ కోసం ఈ బృందం త్వరలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.
సీబీఐ అధికారులు ఎస్ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జేటీ డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ) సిట్‌లో భాగమై విచారణ మొదలు పెట్టారు. త్వరలో వీరి నేతృత్వంలోని బృందం తిరుమలకు వెళ్లనున్నారు.
అక్టోబరు 4న సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో ఇద్దరు సీబీఐ అధికారులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక అధికారితో కూడిన స్వతంత్ర ఐదుగురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసింది. (FSSAI). సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (CALF) నుంచి జూలై నాటి ల్యాబ్ నివేదికలను SIT పరిశీలించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: Tirumala: చంద్రబాబు జేబు సంస్థలా టీటీడీ బోర్డు
Tirumala: ఎక్కడా తప్పు జరగలేదు.. వైభవానికి భంగం వాటిల్లలేదు
Tirumala Laddu row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు
Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
