Olympics: భారత ఒలింపిక్ సంఘం (IOA) 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియా ఆసక్తిని వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 1న ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపినట్లు సమాచారం.
స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మారాలనే ఇండియా దృష్టికి ఒక ముఖ్యమైన అడుగు పడినట్లవుతోంది. భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపింది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని సమాచారం.
2036లో భారతదేశంలో ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అడుగు ముందుకు పడినట్లయింది. “ఈ చారిత్రక అవకాశం దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, యువత సాధికారతను పెంపొందించడం ద్వారా గణనీయమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది” అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని ప్రధాని నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లతో జరిపిన సంభాషణలో, 2036లో చతుర్వార్షిక మహోత్సవాన్ని నిర్వహించడానికి సహకారం అందించాలని ప్రధాని మోదీ వారిని కోరారు.
“భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో, గత ఒలింపిక్స్‌లో ఆడిన అథ్లెట్ల నుండి సలహాలు చాలా ముఖ్యం. మీరందరూ చాలా విషయాలను గమనించి, అనుభవించి ఉంటారు. మేము దీనిని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వంతో పంచుకోవాలనుకుంటున్నాము. 2036కి సన్నాహకంగా ఉండే చిన్న చిన్న వివరాలను మనం అందిపుచ్చుకోవాలి.” అని ప్రధాని మోదీ అన్నారు.
గత సంవత్సరం ముంబైలో జరిగిన 141వ IOC సెషన్‌లో, 140 కోట్ల మంది భారతీయులు క్రీడలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నారని పేర్కొంటూ, 2036లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని పీఎం ధృవీకరించారు. 2036లో భారత గడ్డపై ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు మేము చేస్తున్న ప్రయత్నాల్లో ముందుకెళ్తాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నం. ఈ కల మీ సహకారం, మద్దతు కావాలన్నారు. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా భారతదేశం అభిప్రాయాన్ని సమర్థించారు. భారతదేశం ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి “బలమైన కారణం” ఉందని పేర్కొన్నారు.
2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిన 10 దేశాల్లో భారత్ కూడా ఉంది. నవంబర్ 2022లో, ఆసక్తి చూపిన భారత్‌తో సహా ఈ దేశాలతో IOC చర్చలు ప్రారంభించింది. 2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రారంభ ఆసక్తిని కనబరిచిన 10 దేశాల్లో మెక్సికో (మెక్సికో సిటీ, గ్వాడలజారా-మాంటెర్రే-టిజువానా), ఇండోనేషియా (నుసంతారా), టర్కీ (ఇస్తాంబుల్), ఇండియా (అహ్మదాబాద్), పోలాండ్ (వార్సా, క్రాకో), ఈజిప్ట్ ( కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్), మరియు దక్షిణ కొరియా (సియోల్-ఇంచియాన్) ఉన్నాయి.
ఒలింపిక్స్ కోసం హోస్టింగ్ హక్కుల కేటాయింపు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ద్వారా వివరణాత్మక హోస్ట్ ఎంపిక ప్రక్రియ ద్వారా చేస్తారు. IOC ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ అనే ప్రత్యేక సంస్థను కలిగి ఉంది. దీని ద్వారా ఏర్పాట్లు జరుగుతాయి.
ఇవీ చదవండి: Paraguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!
Gymnast Dipa: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం..
Modi new year wishes: నాటు.. నాటు.. పాటకు ఆస్కార్ అవార్డుతో దేశం ఉర్రూతలూగింది.. ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్
Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
