Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రసవత్తర రాజకీయం చోటు చేసుకుంది. ఎన్నికలకు రెండు వారాలే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం మహారాష్ట్ర (Maharashtra) డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం, సీనియర్ ఐపీఎస్ అధికారి అధికార మహాయుతి కూటమి పట్ల పక్షపాతంతో ఉన్నారని, ఆమె అత్యున్నత పదవిలో ఉంటే పారదర్శకంగా ఎన్నికలు జరగవని ఆరోపించారు.
తక్షణమే అమల్లోకి వచ్చేలా తదుపరి సీనియర్ ఐపీఎస్ అధికారికి శుక్లా బాధ్యతలు అప్పగించాలని, తదుపరి రాష్ట్ర పోలీసు చీఫ్ ఎంపిక కోసం రేపు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుజాతా సౌనిక్‌ని సూచించారు.
సమీక్షా సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికల ప్రకటన సందర్భంగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులు నిష్పక్షపాతంగా మరియు న్యాయంగా వ్యవహరించాలని, వారు తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా వ్యవహరించేలా చూడాలని హెచ్చరించారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో సహా ప్రతిపక్ష పార్టీలు శుక్లా పక్షపాత వైఖరిని ఆరోపించాయి.
“రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లాపై చాలా తీవ్రమైన ఆరోపణ ఉంది. 2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, భారతీయ జనతా పార్టీ కోసం నేరుగా పనిచేస్తున్న ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. మా ఫోన్‌లన్నింటినీ ట్యాప్ చేసి ఇస్తున్నారు. మేం ఏం చేయబోతున్నాం అనే పూర్తి సమాచారం దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద ఉంది’’ అని రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మీడియా సమావేశంలో తీవ్రమైన అలిగేషన్స్ చేశారు.
“ఆమె నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారని మేము ఆశించగలమా? ఎన్నికల పగ్గాలు ఆమెకు ఇవ్వకూడదని మేం చెప్పాం. ఆపై ఎన్నికల కమిషన్ వారికి (బదిలీ) హక్కు లేదని చెప్పింది. ఇది ఎలా జరుగుతుంది? అదే సమయంలో, జార్ఖండ్ డీజీపీని మార్చారు. పోలీసుల ఒత్తిడి ఆధారంగా మహారాష్ట్ర ఎన్నికలను నిర్వహిస్తున్నారు.’’ అని ఆరోపించారు.
ఇవీ చదవండి: AP Elections: ఎన్నికల్లో ఏకపక్ష తీర్పులు దేనికి సంకేతం?! చరిత్ర చెబుతున్న సత్యం..!
Telangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
YS Jagan in Machilipatnam: ఎన్నికలపై మచిలీపట్నం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
Jamili Elections: 2026లోనే కొత్త నియోజకవర్గాలు.. 2027లో జమిలి?
Semi Jamili: సెమీ జమిలికి సై.. 13 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?
