HomeAndhra PradeshAP TET Results: ఏపీ టెట్ ఫలితాలు వెల్లడి.. డీఎస్సీపై లోకేష్ ఏమన్నారంటే..

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు వెల్లడి.. డీఎస్సీపై లోకేష్ ఏమన్నారంటే..

AP TET Results: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఈ ఏడాది టెట్ (AP TET Results) నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను నేడు మంత్రి లోకేష్ రిలీజ్ చేశారు.

రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేశామన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరయ్యారన్న లోకేష్, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. ఫలితాలను వెబ్ సైట్ (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ స్పందించారు. టెట్ ఫలితాల విడుదల సందర్భంగా మెగా డీఎస్సీ గురించి లోకేష్ వివరాలు వెల్లడించారు. నిరుద్యోగ టీచర్ ఉద్యోగార్థులకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

Read also: DSC Notification: 6న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్.. టెట్ ఫలితాలపై అప్ డేట్!
AP TET: రేపటి నుంచి ఏపీ టెట్.. 4.27 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు
TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ జాబ్స్ సాధించిన వారికి సర్కారు ఝలక్..!
AP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!
AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవీ..
Lokesh Red Book: రెడ్ బుక్‌లో మూడో ఛాప్టర్ త్వరలోనే ఓపెన్ చేస్తాం
Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు