HomeNationalISRO Recruitment 2026: ఇస్రోలో 244 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు! పూర్తి...

ISRO Recruitment 2026: ఇస్రోలో 244 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు! పూర్తి వివరాలివే..

ISRO Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోని వివిధ పరిశోధనా కేంద్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న పే మ్యాట్రిక్స్ లెవల్-4 ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతరిక్ష రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 244 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లోని కేంద్రాల్లో 15 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట (షార్) కేంద్రంలో 49 ఖాళీలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు

  • అసిస్టెంట్ (Assistant): 130 పోస్టులు

  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA): 82 పోస్టులు

  • అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC): 22 పోస్టులు

  • స్టెనోగ్రాఫర్ (Stenographer): 10 పోస్టులు

విద్యా అర్హతలు & అనుభవం

  • అసిస్టెంట్, UDC పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు: డిగ్రీ లేదా ‘డిప్లొమా ఇన్ కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్’ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు స్టెనో-టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్‌గా కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి (Age Limit)

ఆగస్టు 16, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది:

  • OBC అభ్యర్థులకు: 31 ఏళ్ల వరకు

  • SC / ST అభ్యర్థులకు: 33 ఏళ్ల వరకు

వేతనం (Salary)

ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ.25,500 (Pay Level-4) ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువు భత్యం (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA) తదితర అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు రుసుము & ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: జులై 27, 2026

  • దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 16, 2026

  • దరఖాస్తు రుసుము: జనరల్/OBC అభ్యర్థులకు రూ.500.

  • మినహాయింపు: SC, ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read also: ISRO VSSC Recruitment 2026: ఇస్రోలో 460 అప్రెంటిస్ ఖాళీలు.. వాక్-ఇన్ సెలక్షన్‌కు ఇలా హాజరవ్వండి
ISRO: ఇస్రోలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు.. అర్హ‌త‌, పూర్తి వివ‌రాలు ఇవే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు