Pawan Kalyan: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగమై ఉండి, సీఎం తర్వాత స్థాయిలో ఉండి పోలీసులు సహకరించడం లేదని, హోంమంత్రి చొరవ తీసుకోవడం లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు. హోం శాఖ మంత్రి అనిత అసమర్థతను బహిర్గతం చేసేలా పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీజీపీ మీరు ఛార్జ్ తీసుకున్నారని, కానీ ప్రజలు మేము బయటకు వస్తే తిడుతున్నారంటూ పవన్ వాపోయారు.
మహిళలపై అత్యాచార ఘటనలు గత ప్రభుత్వం తాలుకా వారసత్వం అన్న పవన్.. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం ఆదేశిస్తే నన్ను చంపేస్తామని ఒకరు, మా ఇంట్లో ఆడబిడ్డల మీద అఘాయిత్యం చేస్తామని ఇంకొకరు మాట్లాడేవారన్నారు. వీటిపై ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇళ్లల్లోకి వచ్చి రేప్ లు చేసేస్తున్నారని ముడిపెట్టి మాట్లాడారు.
ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడితే వైయస్సార్ సీపీ వాళ్లు ఎంకరేజ్ చేశారని, 33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ పై మాట్లాడితే గత ముఖ్యమంత్రి మాట్లాడలేదని, రోడ్లపైకి వచ్చి బుగ్గలు నిమిరితే ఏమొస్తుందని సెటైర్లు వేశారు. తనను కూర్చోబెట్టి భయపెట్టగలరని, ఒక రేపిస్ట్ ను ఎందుకు వదిలేస్తున్నారన్నారు. ఒక సీఎంను చంపేస్తామన్నా ఎందుకు వదిలేస్తారు? అని ప్రశ్నించారు.
అప్పులు వారసత్వంగా ఎలా వచ్చాయో.. వీళ్లు చేసిన క్రైమ్, అలసత్వం కూడా వారసత్వంగా వచ్చిందని పవన్ కామెంట్ చేశారు. గత మూడు నెలలు నుంచి ఒక్కటే చెప్పానని, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టాలని అధికారులకు సూచించానన్నారు. అధికారులకు అలవాటు పోయిందన్నారు. ఇదివరకు అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేశారని, ఈరోజు ధర్మంగా చేయమంటే మీన మేషాలు లెక్కపెడుతున్నారని దుయ్యబట్టారు.
‘‘క్రిమినల్ కి కులం, మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకు.. అరెస్ట్ చేయాలంటే కులం సమస్య ఎందుకు వస్తుంది? మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?..ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు.. అప్పటి, ఇప్పటి పార్లమెంట్ సభ్యులు జయాబచ్చన్, పార్లమెంట్ సభ్యులందరూ చంపేయండని పార్లమెంట్లో మాట్లాడారు’’ అని పవన్ గుర్తు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి సమర్థించారు. గత ఐదేళ్లుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. ఇంకా అధికారుల తీరు మారడం లేదన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారుల తీరు మారాలని జేసీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు వైయస్సార్ సీపీకి పూర్తిగా దాసోహం అయ్యారన్నారు. ఆర్థిక, రాజకీయ ఒత్తిడులకు ఉన్నతాధికారులు తలొగ్గవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.
ఇవీ చదవండి: Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు
Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష
Pawan at Vizianagaram: విజయనగరంలో పవన్ పర్యటన.. అతిసార బాధితులకు పరామర్శ
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
