Relationship: స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే పద్ధతిని లివింగ్ రిలేషన్ లేదా సహజీవనం (Relationship) అంటాం. పెళ్లి చేసుకోకుండా లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటకు కూడా చట్టపరంగా కొన్ని హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు.
లివ్ ఇన్ రిలేషన్ షిన్ లో ఉండే వారు కోరుకున్నట్లు జీవించాలంటే, వారికి మద్దతు ఇస్తున్న చట్టాలు, హక్కులపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 వంటి చట్టాలు ప్రతి ఒక్కరి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతను ఇస్తాయి. సహజీవనం చేసేవారు ఇలాంటి చట్టాల ప్రకారం వేధింపులు, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు. వారు గౌరవంగా బతకొచ్చు.
న్యాయ, శాసన మద్దతు
ఇటీవల కాలంలో శాసన, న్యాయ వ్యవస్థలు వివాహం చేసుకోకుండానే కలిసి జీవించేవారి హక్కులను గుర్తించాయి. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రతిపాదన ఈ వ్యవహారంలో కీలక అడుగు అని చెప్పొచ్చు. ఇది చట్టంగా ఆమోదం పొందితే, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరికి చట్టపరమైన హక్కులు లభిస్తాయి.
ఆర్థిక భద్రత
అవివాహిత జంటలకు ఆర్థిక భద్రత అనేది చట్టంలోని మరొక కీలకమైన భాగం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 125(1)(a) ప్రకారం, లివ్-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములు, వివాహంలో జీవిత భాగస్వాములకు సమానమైన మెయింటెనెన్స్‌కి అర్హత కలిగిన వారు. ఈ నిబంధన ఆర్థిక స్థిరత్వం, భాగస్వాముల మధ్య అనుబంధాలను బలపరుస్తుంది.
గృహ హింస చట్టం
సహజీవనంలో ఉన్న అవివాహిత వ్యక్తులకు గృహ హింస యాక్ట్ ప్రకారం సేఫ్టీ ఉంటుంది. ఈ చట్టం, రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారు గృహ హింసను ఎదుర్కొంటే చట్టపరమైన పరిష్కారాలు పొందే చాన్స్ ఉంటుంది. ఈ రక్షణ మహిళలు న్యాయం పొందేందుకు, వేధింపులకు భయపడకుండా జీవించేందుకు దోహదం చేస్తుంది.
అవివాహిత జంటలకు జన్మించిన పిల్లల లీగల్ స్టేటస్ కూడా ఇటీవల కాలంలో బాగా మెరుగైంది. పెళ్లి చేసుకున్న వారికి జన్మించిన వారితో పోలిస్తే, లాంగ్ టర్మ్ లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నవారికి పుట్టిన పిల్లలు వివక్షను ఎదుర్కొనరాదని న్యాయస్థానాలు కూడా తీర్పులు వెల్లడించాయి. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం, ఈ పిల్లలకు హక్కులకు రక్షణ లభిస్తోంది. ముఖ్యంగా ఆస్తి హక్కులు, కస్టడీ విషయాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి.
ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..
పెళ్లికాని జంటలను సమాజంలో పూర్తి స్థాయిలో అంగీకరించే పరిస్థితి ఉండదన్నది మన సమాజంలో కామన్. అయితే, భారతదేశంలో వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులు రక్షణను కల్పిస్తాయి. ఈ హక్కులు వేధింపులు, హింస, ఆర్థిక అస్థిరత నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడంలో దోహద పడతాయి. ఈ చట్టపరమైన నిబంధనలు అవివాహిత జంటలు సామాజిక పక్షపాతం లేకుండా గౌరవంగా జీవించేందుకు ఉపయోగపడతయి. సరైన లీగల్ నాలెడ్జ్ ఉంటే, వారు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు.
ఇవీ చదవండి: Relationship goal: రిలేషన్ షిప్‌లో క్లోజ్‌గా ఉండాలంటే అలాంటి పొరపాట్లు చేయకుండి!
Relationship Tips for Couple: భాగస్వామితో ఆ విషయాలు చెప్పకూడదట..!
Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?
Relationship tips for Couple: ఈ 5 అలవాట్లతో మీ బంధాన్ని దెబ్బతీసుకొనే ప్రమాదం..!
Couple Relationship : దంపతులు నిత్యం గొడవ పడుతున్నారా? ఈ టాపిక్స్ తీసుకురాకండి..
