Relationship Tips for Couple: చాలా మంది తమ జీవిత భాగస్వామికి అన్ని విషయాలూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడూ చిక్కులు వచ్చి పడుతుంటాయి. దాంపత్యంలో మధురానుభూతిని కలకాలం నిలుపుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమ, బాధ, కోపం లాంటి భావోద్వేగాలను భాగస్వామితో షేర్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఈ క్రమంలో భావోద్వేగాల నియంత్రణ కూడా కీలకం. కొన్ని విషయాలు భాగస్వామితో (Relationship Tips for Couple) చెప్పడం వల్ల మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది.
భాగస్వామి (Relationship Tips for Couple) కుటుంబం గురించి సదభిప్రాయం లేని వారు ఆ విషయాన్ని బాహాటంగా చెప్పకూడదని నిపుణులు సూచిస్తున్నారు. భాగస్వామిని ప్రేమించినంత మాత్రాన వారి కుటుంబంపై కూడా ఇదే భావన ఉండాలని లేదు. ఇలాంటి అంశాన్ని వారు నొచ్చుకొనేలా చెప్పకుండా దాచేయడం బెటర్. ఇక ప్రతి ఒక్కరి జీవితంలోనూ మాజీ ప్రేయసి లేదా మాజీ ప్రియుడుఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో భాగస్వామికి చెప్పకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల అనర్థాలు కలుగుతాయంటున్నారు.
చెప్పకూడని విషయాలు, సరైన సమయం కాదని భావించే అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వారి మధ్య గొడవలకు తావిచ్చినట్లవుతుంది. ఈ కారణంగా నిత్యం, గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి తరుణంలో కాస్త సంయమనం పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని అంశాలను జీవిత భాగస్వామికి చెప్పకుండా దాచాలని చెబుతున్నారు.
ఆఫీసులోనో, బయట ప్రాంతాల్లో పరిచయమైన వారు ఎవరైనా మిమ్మల్ని లైక్ చేస్తున్నారనో, మీరు వారిని లైక్ చేస్తున్నారనో భాగస్వామికి అస్సలు చెప్పకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తగవులు ఏర్పడతాయంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే ఆ విషయం మీ భార్యకో, భర్తకో తెలిస్తే వారిలో అభద్రతాభావం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భాగస్వామి తెచ్చిన బహుమతులు నచ్చకపోయినా అలాంటి సందర్భాల్లోనూ నేరుగా చెప్పకూడదని, ఇలా చెబితే వారి మనోభావాలు దెబ్బతింటాయంటున్నారు.
ఇద్దరూ హద్దుల్లో ఉండాలి..
బంధం కలకాలం దృఢంగా ఉండాలంటే భాగస్వామితో హద్దుల్లో ప్రవర్తించడం ఇద్దరికీ అనివార్యం. అనేక అంశాల్లో హద్దులు మీరిన సందర్భాల్లో బంధం బలహీనపడటానికి ఆస్కారం ఉంటుంది. అయితే, ఏ అంశాల్లో హద్దుల్లో ఉండాలనేది ఇద్దరూ తెలుసుకోవాలి. ఏ బంధమైనా కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. అప్పుడే అది ఆనందదాయకంగా ఉంటుంది.
ఒక బంధం కలకాలం సంతోషంగా నిలవాలంటే అందుకు సరిహద్దు రేఖగా హద్దులను పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వల్ల ఆరోగ్యకర వాతావరణం ఇరువురి మధ్య ఏర్పడుతుంది. హద్దులు మనం ఒకరి వ్యక్తిగత స్థలం, సౌకర్య స్థాయి, పరిమితులను ఎలా గౌరవించవచ్చో చూపుతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. మీ సరిహద్దులను భాగస్వామికి తెలియజేయాలి.
ఇలా పాటించే బంధంలో ఇద్దరూ అన్యోన్యంగా ఉండగలుగుతారు. బంధంలో వ్యక్తి భావోద్వేగ, శారీరక, మానసిక శ్రేయస్సు అంశాల్లో హద్దులు అవసరం. అసౌకర్యానికి, సౌకర్యానికి మధ్య రేఖలా హద్దులను భావించాలి. బంధం ఏదైనా అందులో హద్దులు ఉండాలని మానసిక వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. బంధంలో హద్దుల గురించి వారు వివరిస్తున్నారు. హద్దుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం సంతోషంగా సాగుతుందంటున్నారు.
అతి చేయకూడదు..
మానసికంగా, భావోద్వేగాల పరంగా కొన్నిహద్దులు ఉండాలి. ఇది ఇద్దరికీ మంచిది. భావోద్వేగ సరిహద్దులను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి వినియోగించుకోవాలి. ఆరోగ్యకరమైన భావోద్వేగ సరిహద్దులు ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలి. మీ భాగస్వామి కలత చెంది, మీరు ఈ అనుభూతిని పంచుకోవడం గమనించినట్లయితే, సరిహద్దు అవసరం అవుతాయి. ఇక లైంగికపరమైన హద్దులు కూడా ఉండాలి. దీనిపై ఇరువురూ చర్చించుకోవాలి.
అతిగా లైంగిక వాంఛలు కలిగి ఉన్నా నష్టమే కలుగుతుంది. మరోవైపు నమ్మకాలు, ఆలోచనల్లోనూ ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. వీటిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఇలా చేయడం ఇద్దరికీ మేలు చేస్తుంది. ఒకరి అభిప్రాయానికి విలువ ఇచ్చి మరొకరి అభిప్రాయాన్ని పంచుకోవడం మంచి చేస్తుందని మానసిక వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.
Read Also : Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?