దంపతుల మధ్య (Couple Relationship) తరచూ తగాదాలు, వివాదాలు సహజమే. కానీ, ఇవి ఎక్కువైతేనే సమస్య వస్తుంది. ఇద్దరూ పరస్పరం ఆలోచనలు పంచుకుంటూ, ఏ సమస్య వచ్చినా చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అప్పుడే దాంపత్య జీవితం (Couple Relationship) సుఖంగా ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు గొడవలు పెరుగుతుంటాయి. అలాంటివి అవాయిడ్ చేస్తే మ్యారిడ్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.
1. కొన్ని అంశాలు దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
2. మానసికంగా, శారీరకంగా కలిసి ముందుకు సాగాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
3. దాంపత్య జీవితాన్ని దెబ్బతీసే అంశాలు ఏంటో తెలుసుకొని జాగ్రత్త పడాలి. భార్యా భర్తలు అన్ని విషయాల్లో అవగాహనతో ఉండాలి.
4. ఒకరినొకరు గౌరవించుకోవాలి. పెళ్లి జరిగిన కొత్తలో చాలా జంటలు అన్యోన్యంగా ఉంటారు.
5. ఈగోలు పక్కన పెడితే గొడవలే రావు..
6. కొన్ని విషయాల్లో దంపతుల మధ్య ఈగో ప్రవేశిస్తుంటుంది.
7. ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.
8. ఈగోలు పక్కన పెట్టేయడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందాలకు ఇది చాలా ముఖ్యం.
9. గొడవ పడే సమయానికి కామన్ గా ఈగో అడ్డు వస్తుంది. దాన్ని అధిగమిస్తే సంసారం సుఖమయం అవుతుంది.
10. భార్యకు కష్టం వచ్చినప్పుడు భర్త, భర్తకు ఇబ్బంది కలిగినప్పుడు భార్య అర్థం చేసుకోవాలి.
11. జీవిత భాగస్వామికి సపోర్ట్ గా నిలవాలి. గొడవలకు కారణం చాలా వరకు కాంప్రమైజ్ కాకపోవడమే. ఇలాంటివి దరిజేరనీయకండి.
12. భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు.
13. ఒకరు ఏదైనా విషయంలో అలిగి గోల చేస్తుంటే మరొకరు సైలెంట్ గా ఉండటం బెటర్.
14. ఈ టెక్నిక్ చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. భాగస్వామికి గౌరవం ఇవ్వాలి.
15. విశ్వాసం ఉంచాలి. అనుమానాలకు తావివ్వరాదు.
16. తరచూ అలక బూనితే బుజ్జగిస్తూ ఉండాలి. ఒకరి బంధువులను మరొకరు గౌరవం ఇస్తూ ఉండాలి.
Also Read : Blood Purifying: రక్త శుద్ధి చక చకా జరిగేందుకు ఏ ఆహారాలు తీసుకోవాలి?