రిలేషన్‌షిప్‌లో (Relationship tips for Couple) చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని విషయాల్లో అవతలి వ్యక్తిపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం, వాటిని అవతలి వారు చేరుకోకపోవడంతో నిరాశకు గురవుతుంటారు. దీంతోపాటు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల రిలేషన్ షిప్ (Relationship tips for Couple) దెబ్బతింటూ ఉంటుంది. అలాంటి కొన్ని మిస్టేక్‌ల గురించి అందరూ తెలుసుకోవాలి.
ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే ప్రేమ, నిజాయితీ తప్పనిసరిగా ఉండాలి. పరస్పరం గౌరవించుకోవడం ముఖ్యం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నంత వరకే ఏ బంధమైనా గట్టిగా ఉంటుంది. భార్యా, భర్తలైనా, యువతీ యువకులైన ప్రేమికులైనా, స్నేహితులైనా ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు ఉంటాయి. బంధం బలపడాలంటే ఇరు పక్షాల నుంచి సమానంగా నిజాయితీ, నమ్మకం ఉండాల్సిందే.
అవతలి వ్యక్తి నుంచి అన్ని అంశాల్లోనూ అతిగా ఆశించడం తప్పని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామి నుంచి ఎక్కువ ఆశించే వారు పరిపూర్ణులు కాదని చెబుతున్నారు. ఇలాంటి వారిలో కొన్ని లోపాలుంటాయని చెబుతున్నారు. ఇలాంటి వారిని మార్చుకోవాలంటే వారిలో ఆశించడానికి బదులు ప్రేమించడం నేర్పాలని సూచిస్తున్నారు.
భాగస్వామి చిన్న పొరపాటు చేసినా సహించలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు కాస్త ఆలోచించాలి. తప్పులు అనేవి అందరూ చేస్తుంటారు. ఎదుటి వ్యక్తి చేసిన తప్పును మన్నించగలగాలి. అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాద్ధాంతాన్ని పెంచకుండా ఉండాలి. సంయమనం పాటిస్తుండాలి. కొందరు ప్రతి పనిలో తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వారు తప్పు చేసినా.. రోజూ ఇలాంటివి జరగడం ప్రారంభించినప్పుడు, బంధంలో ప్రేమ తగ్గిపోతుంది. భాగస్వామితో ఏకీభవించే జంటలు సంతోషంగా ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాంప్రమైజ్ అవని వారితో పోలిస్తే.. సర్దుకుపోయే వారిలో విడాకులు తీసుకొనే వారి శాతం తక్కువని చెబుతున్నారు.
ఓ అధ్యయనంలో తేలిన దాని ప్రకారం.. ప్రతి విషయంలో ఒకరితో ఒకరు ఏకీభవించే జంటలు.. ఇలా చేయని జంటల కంటే విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఇది ఎందుకు జరుగుతోందంటే.. మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీతో ఏకీభవించాలని మీరు ఆశించినప్పుడేనట. మనం మన అభిప్రాయానికి ఇచ్చినంత ప్రాధాన్యత భాగస్వామి అభిప్రాయానికి కూడా ఇవ్వడం లేదని దీని అర్థం.
ఇలా చేయడం ఏ బంధానికి ఆరోగ్యకరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు, మీతో ఏకీభవించేలా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా, వారి మాటలు వినడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారని, ఇది ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు.
ఇలా చేయడం ఏ బంధానికి ఆరోగ్యకరం కాదు. అటువంటి పరిస్థితిలో, మీ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు, మీతో ఏకీభవించేలా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా, వారి మాటలు వినడానికి ప్రయత్నించండి. దీనితో మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
Read Also : Spiritual Plants: ఈ చెట్లను పూజిస్తే.. ధనవంతులు కావడం గ్యారెంటీ!