Wife and Husband Relationship: కొందరు భార్యా భర్తలు (Wife and Husband Relationship) నిరంతరం ఏదో ఒక నిందలు వేసుకుంటూ గడుపుతుంటారు. ఎప్పుడూ కీచులాడుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటుంటారు. ఇలాంటి వారు తమ ఆలోచనలతో, నిందారోపణలతో కాపురంలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్త జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల సంసారాన్ని (Wife and Husband Relationship) పూలబాట చేసుకోవచ్చు. తమ తప్పులను అంగీకరించడం ద్వారా సగం సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
తనను తాను రక్షించుకోవడానికి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇతరులపై నెపాన్ని నెట్టివేస్తుంటారు కొందరు. ఈ నేపథ్యంలో వారిని అర్థం చేసుకొని కాస్త కొత్త పద్ధతుల్లో వారికి నచ్చజెప్పడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. నిందలు వేయడానికి బదులుగా అభినందించడం, గొడవలు జరుగుతుంటే అలాంటి సమయాల్లో కాస్త టాపిక్ డైవర్ట్ చేస్తూ కొత్త విషయాలు చర్చించడం లాంటివి చేస్తుండాలి.
తాము చేసిన తప్పులకు ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలి. అలా నెట్టేసే అలవాటును వీలైనంత తొందరగా మానేయాలి. ఇలాంటి వారి రిలేషన్ షిప్‌కు కూడా హాని కలిగించేలా వ్యవహారశైలి మారుతుంది. ఇతరులను ఎప్పుడూ నిందిస్తూ ఉండడం అనేది కాస్త డిఫరెంట్ మెంటాలిటీ అని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వారిలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
ఇద్దరి మధ్య తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. భాగస్వామిలో తప్పులను వెతికే పని మానుకోవాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఉండాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మీ భాగస్వామి ఆలోచనలు అర్థమవుతాయి. సమస్య ఏదైనా కాస్త చర్చించుకొని పరిష్కరించుకోవాలి. నిందించటానికి బదులు, మీరు మొదట ఈ సమస్యపై వారిని స్వంతంగా ప్రశ్నిస్తే, వారికి సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. ప్రశ్నలు కాస్త సున్నితంగా అడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు కూడా భాగస్వామిని మంచి మార్గంలో అర్థం చేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ పెరిగి సమస్యలు దూరమవుతాయి.
ఈ పొరపాట్లు చేయకుండి..
నచ్చిన వ్యక్తులతో రిలేషన్ షిప్ లో దగ్గరగా మెలగాలంటే కొన్ని అలవాట్లు మానుకోవాలి. మరి కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు పరిచయం ఉన్న అందరితోనూ క్లోజ్ గా మెలగలేం. నచ్చిన వ్యక్తులు కొందరితోనే అన్ని విషయాలూ పంచుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో మనకు దగ్గరైన వ్యక్తులతో బంధం మరింత దగ్గర అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటిస్తుండాలి.
నిజాయితీగా ఉండడంతోపాటు మీ ఇద్దరికీ ఇష్టమైన వాటిని చూడటం, ఔటింగ్ కు వెళ్లి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుంది. అలాగే ఒకరి కోసం మరొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవడం వల్ల దగ్గరవడానికి వీలవుతుంది.
బంధం దగ్గరవ్వాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. తప్పులు పదే పదే చేస్తుండడం వల్ల రిలేషన్ దెబ్బతినే చాన్స్ ఉంటుంది. మనం క్లోజ్ గా ఉండాలని అనుకొనే వారితో ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా నిజాయితీగా ఉన్నామని రుజువు చేసుకోవాలి. నిజాయితీగా మెలగడం వల్ల మిమ్మల్ని మీ పార్ట్నర్ వదిలి పెట్టలేరు. ఒక వేళ మీరు మీ నిజాయితీని నిరూపించుకోలేకపోతే వారు మిమ్మల్ని విశ్వసించలేరు. ఎప్పుడూ నమ్మకం కలగదు. అందుకని మీరు కచ్చితంగా నిజాయితీగా ఉండి తీరాలి.
ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరగాలంటే ఒకరికి మరొకరు కమ్యూనికేట్ చేయడంలో కరెక్ట్ గా ఉండాలి. చిన్న విషయాలను కూడా ఆనందంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరూ కలిసి ఆనందిస్తూ గడిపితే అద్భుత క్షణాలు అవుతాయి. మీకు నచ్చిన వారితో క్లోజ్ గా ఉండాలంటే ఇలాంటివి ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది. మీ బంధం తప్పకుండా దృఢంగా మారుతుంది.
Read Also : Relationship tips for Couple: ఈ 5 అలవాట్లతో మీ బంధాన్ని దెబ్బతీసుకొనే ప్రమాదం..!