Charging: ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్లలో చార్జింగ్ అయిపోయే సమస్య ఎక్కువైంది. బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు చార్జింగ్ అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. మొబైల్ లేకుండా, అందులోనూ చార్జింగ్ (Charging) లేకుండా ఒక్క రోజు కూడా గడవదు.
చార్జింగ్ అయిపోయే సందర్భాల్లో బ్యాటరీ క్యారీ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మొబైళ్లకు 5,000 లేదా 8,000 mAh బ్యాటరీలు రావడం కామన్. 24 గంటల్లో కనీసం రెండు సార్లు అయినా చార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ, ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 ఏళ్లపాటు మన్నిక వస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..
బ్యాటరీలన్నీ ప్రస్తుతం లిథియం అయాన్‌తో రూపుదిద్దుకుంటున్నాయి. కానీ ఇది అలా కాదట. రేడియో యాక్టివ్ కాంపౌండ్ నికెల్-63తో తయారు తయారు చేస్తారట. ఈ బ్యాటరీ చాలా పవర్ ఫుల్. ఒకసారి ఛార్జింగ్ పెడితే మళ్లీ 50 ఏళ్ల తర్వాతే చార్జింగ్ పెట్టే పరిస్థితి. దీన్ని చైనీస్ స్టార్టప్ కంపెనీ బీటావోల్ట్ అభివృద్ధి చేస్తోందట. లిథియం బ్యాటరీలకు బదులుగా, న్యూక్లియర్ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దాని శక్తి చాలా ఏళ్లపాటు ఉంటుందని, మన్నిక వచ్చి నడిపిస్తుందని చెబుతున్నారు. ఎనర్జీ కన్వర్షన్‌కి డైమండ్ సెమీకండక్టర్‌ను ఉపయోగిస్తున్నట్టు సమాచారం.
ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. వచ్చే ఏడాదిలోగా ఈ శక్తిని 1 వాట్‌కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ పరిమాణంలో లిథియం బ్యాటరీ కంటే చాలా స్మాల్ గా ఉంటుంది. గరిష్ట పొడవు 15 మి.మీ. దాకా ఉంటుంది. ఈ బ్యాటరీ ఎప్పటికీ పగిలిపోదు లేదా బర్న్ కాదు.. ఇదే అందులోని అతిపెద్ద ఫీచర్. ఈ బ్యాటరీ మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని, కూలింగ్ ను తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంది.
ఈ బ్యాటరీని మొబైల్ ఫోన్లలో ఎప్పుడు తీసుకొస్తారనే అంశంపై ఆ కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే మరికొన్ని ఏళ్లలో ఈ బ్యాటరీని మార్కెట్లోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, డ్రోన్‌లలో ఉపయోగించాలని సదరు సంస్థ భావిస్తోందట. ఈ బ్యాటరీలను తర్వాత పేస్‌మేకర్లలో కూడా వాడనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: New Smart Phone: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Smart Phone: మీ ఫోన్ పోగొట్టుకున్నారా? యూపీఐ ఐడీలు ఏమవుతాయంటే..
Oppo A3x 5G: ఒప్పో న్యూ 5జీ ఫోన్ రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవీ
Samsung Galaxy S25: పాత డిస్‌ప్లే టెక్నాలజీని మళ్లీ తెస్తున్న శాంసంగ్
