TTD Chairman Bhumana: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఛైర్మన్ గా రెండేళ్లపాటు భూమన పదవిలో ఉంటారు. గతంలోనూ టీటీడీ ఛైర్మన్ గా భూమన పని చేశారు. టీటీడీ ఛైర్మన్ గా తనను నియమించినందుకు సీఎం జగన్ కు భూమన కరుణాకర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. (TTD Chairman Bhumana)
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు సార్లు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం ఆగస్టు 5తో ముగిసింది. ఈనేపథ్యంలో టీటీడీ కొత్త ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది.
వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన కరుణాకర్‌రెడ్డి జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న భూమన గతంలోనూ టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు నిర్వహించారు. 2012 ఉప ఎన్నిక, 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున భూమన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Read Also : TTD Chairman: టీటీడీ చైర్మన్ రేసులో భూమన? సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి