HomeAndhra PradeshSakshi: 'సాక్షి'కి నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చారా?

Sakshi: ‘సాక్షి’కి నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చారా?

Sakshi: గత ప్రభుత్వంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి (Sakshi) యాడ్స్ ఇచ్చారా? వైయస్సార్ సీపీ పాలనలో సమాచార పౌర సంబంధాల శాఖలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసిందని సమాచారం.

పాత్రికేయ సంఘాల ఫిర్యాదు పై వారంపాటు సాధారణ విచారణ చేపట్టిన ఏసీబీ గత కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, మరి కొందరు అధికారుల ప్రమేయంతో సాక్షి పత్రిక, టీవీ ఛానల్ కు రూ. వందల కోట్ల విలువైన ప్రకటనలు కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణలో ఏ ప్రాతిపదికన ప్రకటనలు జారీ చేశారు? ఏబీసీ (ఆడిట్ బ్యూరో ఆప్ సర్క్యులేషన్) గణాంకాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అని ప్రశ్నించినట్లు సమాచారం.

సాక్షికి అక్రమంగా యాడ్స్ ఇచ్చారంటూ టీవీ 5 తదితర టీడీపీ అనుకూల ఛానళ్లు కథనాల మీద కథనాలు ఇస్తున్నాయి. అయితే సాక్షికి యాడ్స్ ఇవ్వడంపై వైయస్సార్ సీపీ వాదన మరో విధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని ఇటీవల సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసన సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన విషయాన్ని వైయస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇతర పత్రికలకూ ప్రకటనలు
సమాచార శాఖ నిబంధనలు, ఏబీసీ గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతో పాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. సాక్షితో పాటే ఈనాడుకు ఐదేళ్లకు యాడ్స్ ను జగన్ సర్కారు ఇవ్వగా.. ఈనాడు మూడున్నరేళ్ల పాటే యాడ్స్ ను ప్రచురించింది. మూడున్నరేళ్ల తర్వాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఈనాడు యాజమాన్యం సమాచార శాఖకు లేఖ రాసింది. దీంతో చివరి ఏడాదిన్నర ఈనాడు ప్రకటనలు ప్రచురించలేదు.

ఈ కారణంగా సాక్షి పత్రికలో ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు రాగా.. ఈనాడు పత్రికలో రూ. 243 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చాయి. అంతే కాకుండా చంద్రబాబు, జగన్ సర్కారుల మధ్య వివిధ పథకాల అమలును పోలుస్తూ ఇచ్చిన ప్రకటనలను సైతం ఈనాడు ముద్రించలేదు.

ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు యాజమాన్యం ప్రకటనలు తీసుకుని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటనలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడుకు కూడా ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్టు అయ్యేది. మరో కీలక విషయం ఏంటంటే.. సాక్షి పత్రికకు రూ. 104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈనాడుకు రూ.51 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.

సాక్షి పట్ల పక్షపాతంగా వ్యవహరించి ఉంటే గత ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో ఎందుకు పెడుతుంది? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాక్షిని కూడా అన్ని పత్రికల మాదిరిగానే భావించి నిబంధనల ప్రకారం యాడ్స్ ఇచ్చిందంటూ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రకటన కాపీని వైసీపీ నేతలు పోస్టు చేస్తున్నారు.

ఇవీ చదవండి: Capital Amaravati: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టా?
Amaravati: నాడు వద్దన్న బారికేడ్లు.. ఇప్పుడు ఎందుకొస్తున్నాయి? 
EVM Hacking: ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనా? ఏఐ ఏం చెప్పిందో తెలుసా?
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు