HomeAndhra PradeshRK Roja: అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది

RK Roja: అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది

RK Roja: రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు పై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు ఆమె (RK Roja) మీడియాతో మాట్లాడారు.

’’ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదు? రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్తులు పెట్రేగి పోతున్నారు. గుంటూరు లో నవీన్ అనే వ్యక్తి పెమ్మసాని అనుచరుడు అమ్మాయి పై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు.హోం మంత్రి , డిప్యూటి సీఎం ఏం చేస్తున్నారు?

పోలీస్ వ్యవస్థ కక్ష్య సాధింపుకు వాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులను వేధించడానికి వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది చేతల్లో శూన్యం. మీ చేతగాని తనం వల్ల విజయవాడ లో వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 74 మందికి పైగా ఆడపిల్లలు పై అత్యాచారాలు, హత్యలు జరిగాయి.

మహిళా హోం మంత్రి అయి ఉండి అసభ్యకరంగా మాట్లాడుతోంది. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వండి హోం మంత్రి గారూ. బద్వేలులో మహిళ ను హత్య చేస్తే సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. స్పెషల్ ఫ్లైట్ లో హైదారాబాద్ లో అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్నారు.

ప్రజలు అందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు రియాలిటీ షో లో సంతోషంగా ఉన్నారు. ఇంత మంది మహిళలు పై అత్యాచారం రాష్ట్రంలో జరుగుతుంటే షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసింది పవన్ కళ్యాణ్ గారూ అని అడుగుతున్నా.

మదనపల్లి లో ఫైల్స్ కాలిపోతే స్పెషల్ ఫ్లైట్ లో పంపిస్తారు. క్యాబినెట్ లో మహిళా భద్రత గురించి ఏ రోజైనా చర్చించారా..అని అడుగుతున్నా.. దిశ చట్టం, మహిళ పోలీస్ స్టేషన్లు గత ప్రభుత్వం లో ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ లను, దిశ యాప్ లను తిరిగి పునరుద్ధరించండి.

చంద్రబాబు కు ఆడబిడ్డ విలువ తెలియదు, లోకేష్ కు ఆడ బిడ్డ విలువ తెలియదు. మహిళా హోం మంత్రి కు ఆడ బిడ్డ ఉంది, పవన్ కళ్యాణ్ కు ఒక ఆడ బిడ్డ తండ్రిగా ఆలోచన చేయండి. కంటి మీద కునుకు లేదు రాష్ట్రంలో ఆడ బిడ్డల తల్లిదండ్రులు కు బాధపడుతున్నారు. బాలకృష్ణ షూటింగ్ లు చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు?

మీ నియోజకవర్గంలో అత్త,కోడళ్ళు పై అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోవడం లేదు. ఆడబిడ్డ లు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కర్నూలు జిల్లాలో మచ్చు మర్రి లో ఆడబిడ్డ ముక్కలు, ముక్కలుగా నరికి వేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి. ఓట్లు వేసిన ప్రజల్ని పట్టించుకోండి.’’ అని రోజా వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Roja fires on Pawan: పవర్ స్టార్ కాదు రీమేక్ స్టార్.. రోజా ఫైర్‌.. జనసైనికులమంటూ మంత్రి టంగ్‌ స్లిప్‌
Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం
Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..
Anakapalli: ఉచిత ఇసుక ఇవ్వాల్సిందే.. నర్సీపట్నంలో ధర్నా

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు