Roja fires on Pawan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పవన్ పవర్ స్టార్ కాదని, రీమేక్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు, విమర్శలు గుప్పించారు. రుషికొండ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడి వెధవలు బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్ గా పెట్టుకున్నారంటూ ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు. (Roja fires on Pawan)
రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారని మంత్రి రోజా అన్నారు. వైజాగ్ ను క్రైమ్ సిటీగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, ఇది అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ భూముల్లో కట్టడాలు అభివృద్ధి చేస్తుంటే పవన్ కు ఎందుకంత బాధ….? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు రిషికొండ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇలా ఉండగా రోజా మాట్లాడుతూ మాలాంటి జన సైనికులుండగా.. అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. అయితే, తర్వాత కవర్ చేసుకున్నారు.
కోర్టుకంటే పవన్ గొప్పవాడా..? అని మంత్రి రోజా ప్రశ్నలు గుప్పించారు. కొండల పై ఏమీ కట్టకూడదని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కు గీతం యూనివర్సిటీ కబ్జా కనపడలేదా…? అని ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ ఇళ్లు బంజారాహిల్స్ లో కొండపైనే ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు.
జగన్ ఎన్ని ఇళ్లైనా కట్టుకుంటాడు.. నీకెందుకు? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పవన్ చంద్రబాబుకు బానిస అంటూ ఆరోపించారు. చంద్రబాబు కరకట్ట ఇంటికి రూ.40 కోట్లు ఖర్చు పెట్టుకున్నారని, ప్రజల డబ్బును తన ఇళ్లకు, గెస్ట్ హౌజ్‌ల కోసం చంద్రబాబు ఖర్చు పెట్టుకున్నారని గుర్తు చేశారు. తన ఇళ్ల కోసం చంద్రబాబు రూ.187.57 కోట్లు ఖర్చు చేస్తే పవన్ అడగలేదని నిలదీశారు. విశాఖలో దోచేసుకుంటున్నారంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని మంత్రి రోజా అన్నారు.
మాలాంటి "జనసైనికులు" ఉన్నంతవరకు.. రోజా టంగ్ స్లిప్..#Roja #PawanKalyan #JanaSenaParty #VarahiVijayaYatra #VarahiVijayaYatraPhase3 #ChandrababuNaidu #Rushikonda #Visakhapatnam #AndhraPradesh #RojaSelvamani #NTVTelugu pic.twitter.com/jzwEo43uI5
— NTV Telugu (@NtvTeluguLive) August 12, 2023
Read Also : Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం