Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అమరావతి హైకోర్టులో అల్లు అర్జున్ (Allu Arjun) పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల (AP Elections) సమయంలో తనపై నంద్యాలలో (Nandyal) నమోదైన కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ న్యాయస్థానాన్ని (AP High Court) కోరారు.
సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్ పై ఆనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఇవాళ విచారణ జరింది.
ఎన్నికల సమయంలో తమ పైన నమోదు చేసిన కేసును కొట్టేలంటూ సినీ నటుడు అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. అల్లు అర్జున్ పిటిషన్ లో కీలక అంశాలు పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లగా సత్సంబంధాలు ఉన్నాయని ప్రస్తావించారు.
ఆ స్నేహభావంతో తాను రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లానని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత పర్యటన అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున అభినందించేందుకు నంద్యాల వెళ్లానన్నారు. ఎలాంటి బహిరంగ సభ నిర్వహించలేదని ప్రస్తావించారు.
తాను కిషోర్ రెడ్డి ఇంటికి వచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని కోర్టుకు తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ అత్యుత్సాహంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘించామంటూ ఫిర్యాదు చేశారన్నారు. కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళటం తన వ్యక్తిగత నిర్ణయం అయినప్పుడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల సమయంలో తమపై పెట్టిన కేసులు కొట్టేయాలని కోరారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేశారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు అల్లు అర్జున నంద్యాలకు వెళ్లారు. ఊహించని రీతిలో అల్లు అర్జున్ ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భారీ బహిరంగ సభకు తరలివచ్చినట్లుగా చాలా మంది వైయస్సార్ సీపీ అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి శిల్పా రవి ఇంటి ముంగిట గుమిగూడారు.
ఈ నేపథ్యంలో అప్పటికే ఏపీ పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. అయితే, పోలీసుల అనుమతి తీసుకోకుండా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారని అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా ఏపీ హైకోర్టులో సదరు కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు.
అప్పట్లో పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, జబర్దస్త్ నటీనటులంతా పిఠాపురం చేరుకుని క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పవన్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే, ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైయస్సార్ సీపీ తరఫున శిల్పా రవికి మద్దతుగా వెళ్లారు. దీనిపై మెగా ఫ్యామిలీలో లుకలుకలు వినిపించాయి. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్, జనసేన నాయకులు అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు.
ఇవీ చదవండి: Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే
Kiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!
Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అల్లు అరవింద్ ఇచ్చిన పరువు నష్టం దావా కేసులో..!
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Rashmika: I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. డీప్ ఫేక్‌పై కామెంట్స్!
