Jeevitha Rajasekhar: సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. పరువు నష్టం దావా కేసులో ఈ శిక్ష ఖరారు చేశారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇచ్చిన పరువు నష్టం దావా పై నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. ఏడాది జైలు శిక్ష తో పాటు జరిమానా విధించింది కోర్టు. (Jeevitha Rajasekhar)
గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేశారు. రాజశేఖర్ దంపతుల ఆరోపణలపై అల్లుఅరవింద్ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని చిరంజీవి బావ, నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు నేడు తీర్పు చెప్పింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.
Read Also : అదృష్టం అంటే శనయా కపూర్‌దే
చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ కీలక ఆరోపణలు గుప్పించారు. దీనిపై అల్లు అరవింద్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోర్టుమెట్లెక్కారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు పై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా దాఖలు చేశారు అల్లు అరవింద్. జీవిత, రాజశేఖర్ దంపతులు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియో క్లిప్‌లతో పాటు.. మీడియాలో వచ్చిన కథనాలను జత చేసి కోర్టుకు సమర్పించారు.
అప్పటి నుంచి నేటి వరకు సుదీర్ఘ విచారణ చేసిన కోర్టు.. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా వేసింది. అయితే, జరిమానా చెల్లించడంతో ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. దీంతో జీవిత, రాజశేఖర్ పూచీకత్తులను సమర్పించగా పై కోర్టులో అప్పీలుకు నాంపల్లి కోర్టు అవకాశం ఇచ్చింది. అనంతరం వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Friendship: స్నేహ బంధంలో ఆర్థిక బంధాలు కొనసాగిస్తున్నారా? చివరకు ఏమవుతుందంటే..