HomeAndhra PradeshPawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష

Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష

Pawan in Vizianagaram: గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్క కుటుంబానికీ వ్యక్తిగతంగా తాను రూ.1లక్ష అందిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామని పవన్ (Pawan in Vizianagaram) చెప్పారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా వ్యాప్తి చెంది 12 మంది మృతి చెందారన్న వార్తల నేపథ్యంలో పవన్.. ఈరోజు ఆ గ్రామానికి వెళ్లారు. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

’’గుర్ల గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు పూర్తిస్థాయి నివేదిక రావలసి ఉంది. అది రాగానే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించనున్నాం.

జిల్లా పారిశుధ్య, నీటి సరఫరా అంశాలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ IAS అధికారి విజయానంద్ గారిని నియమించడం జరిగింది. వారు స్థానిక యంత్రాంగంతో కలిసి ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక దిశగా అధ్యయనం చేస్తారు.

గతంలో పెద్ద పెంకి వంటి గ్రామాల్లో బోదకాలు వ్యాధి సమస్య నా దృష్టికి వచ్చింది, అక్కడ పారిశుధ్యం సమస్యలు పరిష్కరించడం కోసం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలో మరో దాదాపు 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయి. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నాం.

మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు, కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. చేసి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేది. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన పనిచేయవచ్చు కదా.. అధికారులు గతంలో నిధులు రాలేదు అంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?

బహిరంగ మలవిసర్జన కారణంగా నీటిని కలుషితం చేస్తున్నారు. దీని వలన మీ ప్రాణాలే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రమాదంలోకి నెడుతున్నారు. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ భాద్యతగా అవగాహన కల్పించాలి. అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు భాధ్యత తీసుకోవాలి.

గుర్ల మండలంలో నీటి కలుషితం కారణంగా అతిసారం బారిన పడి 10 మంది మృతి చెందిన విషయం చాలా బాధాకరం. రక్షిత మంచినీరు ప్రజల ప్రాథమిక హక్కు. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసే కొద్ది గత 5 సంవత్సరాల్లో సరిగ్గా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సమస్య ఉంది. గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు వారసత్వంగా వచ్చాయి. అందులో ఈ సమస్య కూడా ఒకటి.

మొన్న పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము 43 గ్రామాలకు త్రాగునీటి సమస్య ఉంది అని చెప్పగానే 24 గంటల్లో అధికారులను పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాం. దాదాపు 2 కోట్ల నిధులు అవసరం అయితే అవి కూడా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాం.

ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ద్వారా బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు ప్రచారం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతుంది. దీని ఫలితం స్థానిక నీటి పరివాక్మక ప్రాంతాలు కలుషితం అయిపోయి, ఆ నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇవీ చదవండి: Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..
Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
Pawan at Vizianagaram: విజయనగరంలో పవన్ పర్యటన.. అతిసార బాధితులకు పరామర్శ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు