HomeAndhra PradeshMLC Jakia Khanam: మద్దతు టీడీపీకి.. చెడ్డపేరు మాత్రం వైయస్సార్ సీపీకి!

MLC Jakia Khanam: మద్దతు టీడీపీకి.. చెడ్డపేరు మాత్రం వైయస్సార్ సీపీకి!

MLC Jakia Khanam: గత ప్రభుత్వంలో శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మంచి పదవిని సొంతం చేసుకున్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్.. అలా ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. ప్రభుత్వం మారగానే పలువురు వలస పక్షులు పార్టీలు మారినట్లుగానే ఈమె కూడా మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అన్నీ మాట్లాడేసుకున్నారని, ఇక అధికారికంగా పార్టీలో చేరడమే తరువాయి అని జూలై 26న వార్తలు వచ్చాయి.

నాటి నుంచి ఎమ్మెల్సీ జకియా ఖానమ్ వైయస్సార్ సీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు తిరుమలలో స్వామి వారి దర్శనానికి వీఐపీ టికెట్లను బ్లాక్ లో సదరు ఎమ్మెల్సీ అమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి.

బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం అమ్ముకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లను భక్తులు పొందారు. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు ఎమ్మెల్సీ జకియా ఖానమ్ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. విచారణలో నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను పోలీసులు చేర్చారు.

బ్లాక్ లో వీఐపీ దర్శనం టికెట్ల కేసుపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తన లెటర్‌ను డబ్బులకు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. కొందరు వైయస్సార్ సీపీ నేతలు తనపై పనికట్టుకొని ఈ కుట్రలో ఇరికించారంటూ వ్యాఖ్యానించారు. తాను విజయవాడ వెళ్తున్నానని తెలుసుకొని, వైయస్సార్ సీపీ నేతలు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఇప్పుడు వైయస్సార్ సీపీలో లేరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జకియా ఖానమ్ టీడీపీలోకి వెళ్లారని గుర్తు చేస్తోంది. మంత్రి లోకేష్ తో కూడా ఆమె భేటీ అయ్యారని ఫొటోలు చూపుతోంది. లోకేష్ తో సమావేశమైన తర్వాత వైయస్సార్ సీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. తిరుమలలో బ్లాక్ లో వీఐపీ టికెట్లు అమ్ముకుంటున్నట్లు వస్తున్న వార్తలతో వైయస్సార్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టీకరించింది. ఈ విషయాన్ని అనవసరంగా వైయస్సార్ సీపీకి అంటగట్టేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని మండిపడింది.

సామాజిక న్యాయం చేస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేద వర్గాలంటూ నాటి సీఎం వైయస్ జగన్.. అన్ని వర్గాలకూ సమున్నత స్థానం కల్పించారని వైయస్సార్ సీపీ గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఒక మైనార్టీ మహిళను అత్యున్నత పదవిలో కూర్చోబెడుతూ ఏకంగా మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీకి అన్యాయం చేస్తూ ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ ఫిరాయించారని, ఇది ధర్మమేనా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచిందే గాక.. ఇప్పుడు తిరుమల బ్లాక్ టికెట్ల వ్యవహారంలో ఓ వర్గం మీడియాలో వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అంటూ ప్రచారం చేయడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది.

ఇవీ చదవండి: Tirumala: ఎక్కడా తప్పు జరగలేదు.. వైభవానికి భంగం వాటిల్లలేదు
Tirumala Laddu row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు
Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…! 
Tirumala 7 Hills: తిరుమల ఏడు కొండల పేర్లు ఏమిటి? ఈ కొండలను ఎక్కడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు