HomeAndhra PradeshChandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు

Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు

Chandrababu: తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నుల పునః ప్రారంభ కార్య‌క్ర‌మం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా సీఆర్డీయే కార్యాలయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

’’ఒక చ‌రిత్ర తిర‌గ‌రాయ‌డానికి మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాం. ఆ రోజు కొత్త రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 16 శాతం లోటు బ‌డ్జెట్ తో ప్రారంభించాం. కూర్చోవ‌డానికి కూడా ప్లేస్ లేక‌పోతే ఈఈ ఆఫీస్ ఉంటే దానినే సెక్ర‌టేరియ‌ట్‌గా చేసుకుని ప‌ని ప్రారంభించాం. హైద‌రాబాద్ నుంచి ఉద్యోగుస్తులను రెండేళ్ల‌లోనే ఇక్క‌డికి వ‌చ్చేలా చేశాం. (Chandrababu)

ప్ర‌పంచంలోనే ఒక విన్నూత్నమైన ఆలోచ‌న‌. హైద‌రాబాద్, సికింద్రాబాద్ రెండు న‌గ‌రాలు ఉండేవి. నేను మూడో న‌గ‌రానికి శ్రీకారం చుట్టాను. అదే సైబ‌రాబాద్‌. రాళ్లు ర‌ప్ప‌లు ఉన్న ప్రాంతాన్ని సుంద‌ర‌మైన న‌గ‌రంగా మార్చాం. దేశంలో నంబ‌ర్ 1 సిటీ సైబ‌రాబాద్‌.

ఎవ‌రూ ఊహించ‌ని రోజుల్లో 8 వ‌రుస‌ల లైన్లురోడ్డు వేశాం. ప‌క్క‌నే స‌ర్వీస్ రోడ్డు వేశాం. మెట్రో క‌నెక్టివి చేశాం. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టుకు 5వేల ఎక‌రాలు ఇస్తామంటే ఆ రోజు హేళ‌న చేశారు. నేను రాబోయే వందేళ్ల గురించి ఆలోచించి ఏపైనా చేస్తా. ఈరోజు జీఎస్‌డీపీ కాంట్రిబూష‌న్ 15, 16 శాతం ఒక్క హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు వ‌ల‌న వ‌స్తోంది.

ఆ రోజు నేను ఒక పిలుపు ఇస్తే 34,241 ఎక‌రాలు 29,881 మంది రైతులు ఒక్క‌రు కూడా కోర్టుకు వెళ్ల‌కుండా ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 1 ల్యాండ్ పూలింగ్ లో భూమి సేక‌రించిన ఘ‌న‌త అమ‌రావ‌తి న‌గ‌రానికే ద‌క్కింది. వార‌స‌త్వంగా వ‌చ్చిన భూమిని ఇవ్వాలంటే సెంటిమెంట్స్ ఉంటాయి. మా భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని ముందుకు వ‌చ్చి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారు.

ప్ర‌భుత్వ భూమి 15167 ఎక‌రాలు వ‌చ్చింది. 4,300లు ల్యాండ్ అక్వైజేష‌న్ కింద ముందుకు వెళ్లాం. మొత్తం క‌లిసి 54,000 ఎక‌రాల భూమి అమ‌రావ‌తికి సేక‌రించిన ఘ‌న‌త టీడీపీది.

గ‌త‌ ప్ర‌భుత్వం అంద‌రికంటే ఎక్కువ అమ‌రావ‌తి రైతాంగాన్ని బాధ‌పెట్టారు. ఇక్క‌డి మ‌హిళ‌లు వీరోచితంగా పోరాడారు. రాణిరుద్ర‌మ కంటే ఎక్కువ‌గా పోరాటం చేశారు. మీ ఉద్య‌మం కోసం నేను జోలె ప‌ట్టి మీకు ఆర్థిక సాయం చేశాను.

మీరు పోరాటం చేస్తుంటే మీ ఇంటి బాత్ రూంల‌పై డ్రోన్స్ వేసి పైసాచిక ఆనందం పొందారు. రాష్ట్రంలోని ఉన్న అన్ని దేవాల‌యాల్లో, మ‌సీదుల్లో, చ‌ర్చిల్లో, ప‌విత్ర‌మైన మ‌ట్టిని, ప‌విత్ర‌మైన జ‌లాల‌ను తీసుకువ‌చ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఆ ప‌వ‌రే మ‌న‌ల్ని కాపాడింది.

ఎంత‌మంది రాక్ష‌స మూక వ‌చ్చినా, ఎన్ని విద్వాంసాలు చేసినా ఈ అమ‌రావ‌తిని బ‌తికించిన ఘ‌న‌త ఈ రైతాంగానిది. ఈ రోజు మ‌ళ్లీ ప్రాణ ప్ర‌తిష్ట చేశాం. ఈ బిల్డింగ్‌ను పూర్తి చేయ‌మ‌ని కోరాం. 160 కోట్ల‌తో జీ+7 ఈ రోజుప్రారంభించాం. నాలుగు నెల‌ల్లో ప‌ని పూర్తి చేస్తాం. 121వ రోజున మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌చ్చి ప్రారంభిస్తా.

ఒక రాష్ట్రం ఒకే రాజ‌ధాని అదే అమ‌రావ‌తి అని ప‌దే ప‌దే చెప్పాను. విశాఖ‌ప‌ట్నంకు, క‌ర్నూలుకు వెళ్లి అక్క‌డ కూడా అమ‌రావ‌తే మ‌న రాజ‌ధాని చెప్పించాను. విశాఖ‌ప‌ట్నాన్ని ఆర్థిక రాజ‌ధానిని చేస్తాం. క‌ర్నూలు మ‌ళ్లీ ఈహైకోర్టు బెంచ్‌ కాకుండా ప‌రిశ్ర‌మ‌లు పెట్టి అభివృద్ధి చేస్తాం.

విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచే కాకుండా.. రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. రైతాంగాన్ని ఒకటే కోరుతున్నా.. ఇక్కడికి వచ్చే వారిని అతిథులుగా గౌరవించాలి. ఐదేళ్లలో ఇక్కడి రైతాంగాన్ని అవస్థలు పెట్టారు.. పనులేవీ జరగలేదు.అందుకే కొంత సమయం తీసుకుంటున్నాం. జరీబు భూముల వారికి ఏటా 10 శాతం లీజు పెంచాలి. మొదటి ఇన్ స్టాల్ మెంట్ రూ.175 కోట్లు ఇచ్చారు.

రెండో ఇన్ స్టాల్ మెంట్ ఇద్దామంటే.. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. గీక్కుంటా ఉన్నాం.. మొత్తం అప్ఫులు తప్ప ఏమీ కనిపించలేదు. ఒక పక్క వడ్డీలు కట్టాలి. అసలు కట్టాలి. అమరావతి కట్టాలి. రైతులను ఆదుకోవాలి. రూ. 225 కోట్లు త్వరలోనే ఇవ్వడానికి వెసులుబాటు తీసుకువస్తున్నారు.

నాన్ జరీబు భూములకు రూ.30 వేలు అనుకున్నాం. ఇప్పడు రూ.57 వేలు అయ్యింది ఇప్పటికి.. అవి కూడా చెల్లించే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5 వేలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. ఏడాదికి రూ.60 వేలు ఆర్థిక సాయం చేసే స్థితిలో ఉన్నాం.

ఒక విజన్ తో ఈ సిటీని ప్రారంభించాను. చాలా మంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. మన సంకల్పం చాలా గొప్పది. ఎప్పటికైనా దానిని సాధించే విశ్వసం మనకుంది. నేను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు. హైదరాబాద్ పై నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

అక్కడ భూమి ఉంది.. కరెంట్ తీసుకుపోయా.. నీళ్లు తీసుకుపోయా. పారిశ్రామికవేత్తలను.. పెట్టుబడులు పెట్టమన్నాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం.. సంపద సృష్టించా. ఔటర్ రింగ్ రోడ్డు కట్టా.. మార్కెంటింగ్ చేసుకున్నాం.. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి కోట్లు వస్తున్నాయి.

రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టాం. సంపద సృష్టించడంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ సిటీ.. నేను అమరావతి ప్రారంభించినప్పుడు ఎకరా రూ.10 కోట్లు పలికింది. వాళ్లు వచ్చాక ఈగలు కూడా రాలేదు ఇక్కడికి. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పా.. ఆదాయాన్ని సృష్టించే ఘని ఇది.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read also: AP Political News: ఇసుక మొత్తం దోచుకున్నాక సీనరేజ్‌ రద్దా?
AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ
Jagan Press Meet: మారిన జగన్.. ఇకపై రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు? సర్కారుపై ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు