HomeSportsInd Vs NZ: ఆ టీమ్‌కు 36 సంవత్సరాలుగా గెలుపు లేదు!

Ind Vs NZ: ఆ టీమ్‌కు 36 సంవత్సరాలుగా గెలుపు లేదు!

Ind Vs NZ: టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య (Ind Vs NZ) నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అయ్యింది. అయితే, ఈ స్టేడియం వేదికగా 12 ఏళ్ల తర్వాత రెండు జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి. మరోవైపు భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఏళ్లుగా న్యూజిలాండ్‌ జట్టు ఒక్క విక్టరీ కూడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరీస్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ జట్లు పోటీ పడి తలపడి పుష్కరకాలం గడిచింది. 2012లో కివీస్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం దక్కించుకుంది. దీంతో భారత్‌ 2-0 తేడాతో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 రన్స్ కు ఆలౌట్‌ అయ్యింది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 353 రన్స్ చేసింది. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సెంచరీ (103)తో చెలరేగాడు. ఎంఎస్‌ ధోనీ (MS Dhoni), సురేశ్‌ రైనాలు (Suresh Raina) అర్ధ శతకాలతో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన చేశాడు. ఆ జట్టు 248 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

1988 తర్వాత గెలవలేదు
కొన్నేళ్లుగా టెస్టుల్లో కివీస్ పేలవ ప్రదర్శన చేస్తోంది. గతంలో భారత పర్యటనలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. 1988లో ముంబై వాంఖడే స్టేడియంలో భారత్‌పై న్యూజిలాండ్ చివరిసారిగా నెగ్గింది. అప్పటి నుంచి నేటి దాకా భారత్‌పై ఆడిన 18 టెస్టుల్లో ఒక్క గెలుపూ లేదు. 2021లో ప్రపంచ టెస్టు ఛాంపియన్స్‌ (WTC) టైటిల్‌ నెగ్గిన కివీస్.. ఆ దూకుడుని ఎక్కువ కాలం కొనసాగించలేక పోయింది. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ కివీస్ కు పరాభవం తప్పలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్స్‌ ర్యాంకింగ్స్‌లో కూడా మరింత ర్యాంకు దిగజారి ఆరో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే విజయాలు సాధించింది. ఫైనల్స్‌కి వెళ్లాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్తమంగా రాణించక తప్పదు.

ఆ రికార్డును ఛేజ్ చేస్తారా?
భారత్‌తో నేటి నుంచి మొదలవుతున్న టెస్టు సిరీస్‌ లో కివీస్ పుంజుకోవడానికి ఓ మంచిచాన్స్ అని చెప్పొచ్చు. అయితే భారత గడ్డపై గెలవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఈ సిరీస్‌ తర్వాత కివీస్.. ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు సిరీస్‌ల్లో కివీస్ జట్టు ఉత్తమంగా ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య 62 టెస్టులు జరిగాయి. భారత జట్టు 22 మ్యాచ్‌ల్లో, కివీస్ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 27 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

ఇవీ చదవండి: Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు