HomeLife StyleMedicine: తెలియకుండా మెడిసిన్స్ వాడుతున్నారా?

Medicine: తెలియకుండా మెడిసిన్స్ వాడుతున్నారా?

Medicine: మనలో చాలా మంది తమ అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్లను సంప్రదించేందుకు మొహమాటపడుతుంటారు. వైద్యుడి దగ్గరికి వెళ్లడం ఇష్టంఉండదు. తెలిసిన వారి సలహా తీసుకోవడం, లేదా స్మార్ట్ ఫోన్లో నెట్ చూసి ఏదో ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ మెడికల్ షాపులో తీసుకుని వాడుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించడం ఎందుకనే భావన ఉంటోంది.

ఈ రకమైన ఆలోచన పెరుగుతోంది. ఇలా ఓ పద్ధతి లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడితే మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విచ్చలవిడిగా ఇలాంటి మందులు వాడితే, చివరికి శరీరం ఏ ఔషధాలకు స్పందించక ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వీటి వినియోగం, విక్రయాలపై సరైన నియంత్రణ ఉండకపోతే భవిష్యత్తులో యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ రూపంలో భారీ ముప్పు పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఢిల్లీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా ఏఎంఆర్ అంటే, బ్యాక్టీరియా, ఫంగస్‌, జెర్మ్స్ డ్రగ్‌-రెసిస్టెంట్‌గా మారిపోవడం. యాంటీబయాటిక్స్, ఇతర మెడిసిన్ మన బాడీపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం. దీంతో అంటువ్యాధులకు చికిత్స కష్టం అవుతుంది. ఆసుపత్రిలో చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. ఖర్చులు కూడా తడిసి మోపెడతవుతాయి. మరణం ముప్పు కూడా ఉంటుంది.

యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతున్న కారణంగా, ఢిల్లీలోని ఫార్మసిస్ట్‌లు వ్యాలిడ్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఎంఆర్ మందులను అమ్మకూడదని రీసెంట్ గా అక్కడి సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా స్టేట్‌ డ్రగ్స్ కంట్రోల్ శాఖ ఈ చర్యలు చేపట్టింది.

ఆల్ ఢిల్లీ కెమిస్ట్స్ అసోసియేషన్‌కు జారీ చేసిన ఈ గైడ్‌లైన్స్‌, డ్రగ్స్ రూల్స్‌లోని షెడ్యూల్ H & H1కి కట్టుబడి ఉండాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి. ఈ షెడ్యూల్స్‌ కింద పేర్కొన్న యాంటీబయాటిక్స్, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే మందులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. యాంటీ మైక్రోబయాల్స్ విచక్షణారహిత వినియోగాన్ని అరికట్టడం ద్వారా పెరుగుతున్న ఏఎంఆర్ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చని ఢిల్లీ సర్కారు ఈ చర్యలకు ఉపక్రమించింది.

రికార్డులు మస్ట్
ఫార్మసిస్ట్‌లు మూడేళ్ల పాటు మూడు, నాలుగో జనరేషన్‌ యాంటీమైక్రోబయాల్స్‌ను కలిగి ఉన్న షెడ్యూల్ H1 ఔషధాల విక్రయాల వివరణాత్మక రికార్డులను నిర్వహించాలి. ఈ శక్తివంతమైన మందుల పంపిణీని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఈ రికార్డ్ కీపింగ్ నిబంధన కీలకం.

ఇవీ చదవండి: Fake Medicine: నకిలీ మెడిసిన్‌ను ఎలా గుర్తించాలి? అనుమానం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
Pregnant Women medicine: గర్భిణులు మెడిసిన్‌ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Christina: వయసు 26 అద్దె గర్భంతో 22 మంది పిల్లలకు తల్లి.. మరింత మందిని కంటానంటున్న భామ!
Dust allergy Problem: డస్ట్‌ అలర్జీతో సతమతం అవుతున్నారా.. ఆయుర్వేద ఔషధాలతో మంచి ఉపశమనం
JAS: AP Govt to launch the second phase of Jagaanna Aarogya Suraksha from Jan 2nd

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు