Rashmika: నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మంధన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ డిపార్ట్ మెంట్ ప్రకటన చేసింది. దీనిపై రష్మిక కూడా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో గతంలో తాను (Rashmika) ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి ప్రస్తావన చేసింది.
వీడియోలో రష్మిక చెబుతూ.. కొన్ని నెలల కిందట నా డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా అయ్యిందని గుర్తు చేసింది. అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుందంది. ఆ చేదు అనుభవం తర్వాత తాను సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డసైడ్ అయ్యానంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని భావించానని తెలిపింది. తాజాగా ఓ విషయాన్ని పంచుకోవడానికి మీముందుకొచ్చానని తెలిపింది.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు (I4C) తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషంగా ఉందని రష్మిక తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఇది వర్క్ చేస్తుందని రష్మిక పేర్కొంది. సైబర్ నేరగాళ్లు మనల్ని టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటారని, దీనిపై అలర్ట్ గా ఉండటంతో పాటు వాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చింది.
ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా తాను ఇలాంటి నేరాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తానని రష్మిక హామీ ఇచ్చారు. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడదామంటూ ఆమె పిలుపునిచ్చారు.
డీప్ ఫేక్ బారిన సెలబ్రిటీలు
కాగా, గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రిలీజ్ కావడం సినిమా వర్గాల్లో కలకలం రేపింది. సోషల్ మీడియా జారా పటేల్ వీడియోకు రష్మిక మొహాన్ని యాడ్ చేసి డీప్ ఫేక్ చేశారు. ఎదలు కనిపించేలా ఎక్స్ పోజింగ్ ఉన్న ఆమె.. రష్మిక లాగా కనిపించేలా చేశారు. చూసేందుకు అభ్యంతరంగా ఉంది.
ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో రష్మిక అప్పట్లో స్పందించారు. దీనిపై సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అయ్యారు. టెక్నాలజీని చూస్తుంటే ఓ వైపు గొప్పగా ఉన్నా మరోవైపు భయంగా ఉందంటూ రష్మిక తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత మరికొందరు సినీ, క్రీడా సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోస్ కూడా వైరల్ గా మారాయి. డీప్ ఫేక్‌లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై అడ్డుకట్ట వేసేలా చర్యలు ప్రారంభించింది.
ఇవీ చదవండి: Mass Jathara: ఆగస్టు 15న మాస్ జాతర.. పుష్ప 2తో సరికొత్త రికార్డులు ఖాయమా?
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Crime News: రూ.10 వేలు ఆశ చూపించి.. రూ.2.29 కోట్లు కొల్లగొట్టేశారు!
Illegal lending: రుణ యాప్‌పై ఈడీ కొరడా.. భారీ జరిమానా.. ఎందుకంటే!
