Gautam Gambhir: టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ (IND vs BAN)లో కోహ్లీ (Virat) పెద్దగా పరుగులు చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి పుంజుకుంటాడని గంభీర్ చెప్పాడు.
త్వరలో కివీస్, ఆసీస్‌లతో జరిగే సిరీస్‌ల్లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని గౌతీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీపై తన ఆలోచనలు ఎంతో స్పష్టంగా ఉన్నాయన్నాడు. అతడు ప్రపంచస్థాయి క్రికెటర్ అని అభివర్ణించాడు. సుదీర్ఘకాలం గ్రేట్ గా రాణించాడని గుర్తు చేశాడు. అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం అతడిలో నేటికీ ఉందన్నాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలి మ్యాచ్ ఆడినప్పుడు కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు గుర్తుందన్నాడు. అతడిలో పరుగుల దాహం ఎప్పటికీ అలాగే ఉంటుందన్నాడు. వచ్చే సిరీస్‌ల్లో అతడు భారీగా రన్స్ చేయాలనే ఆకలి కోహ్లీకి ఉందన్నాడు.
విరాట్ ఈ ఏడాదిలో మూడు టెస్టులు ఆడాడు. అయితే, అర్ధ శతకాలకు పైబడి పరుగులు సాధించలేదు. దీంతో అతడి ఫామ్‌పై అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీకి గంభీర్ బాసటగా నిలిచాడు. ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు టెస్టు మ్యాచులు ఆడనుంది. తొలి టెస్టు బెంగళూరు వేదికగా జరుగుతుంది. అనంతరం నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలవుతుంది.
టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతంగంభీర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆయనకు బర్త్ డే విశెష్ చెప్పారు. బీసీసీఐ కార్యదర్శి జైషా గంభీర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన కోచ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. భారత క్రికెట్ భవిష్యత్‌ను రూపొందించే మరో సంవత్సరం ఇక్కడ ఉంది.. మీకు నిరంతరం విజయాలు తోడుండాలని ఆకాంక్షిస్తున్నానంటూ జై షా ఎక్స్ లో పోస్టు పెట్టారు.
ఇవీ చదవండి: Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
Virat Kohli Assets: కింగ్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఇదే.. స్టాక్ గ్రో వెల్లడించిన ఆసక్తికర విశేషాలు
Virat Kohli : డోంట్ మెస్ విత్ కింగ్ కోహ్లీ.. ఎవరిది వాళ్లకిచ్చేయడం విరాట్ స్పెషల్!
