MS Dhoni Kohli Remuneration: ప్రతీభావంతులైన క్రీడాకారులకు పెద్దమొత్తంలో రెమ్యునరేషన్ అందుతుంది. భారత్‌లో అత్యధికంగా ఆదాయం ఆర్జించే పేరొందిన ఆటగాళ్లు అనగానే ధోనీ, కోహ్లీ పేర్లు గుర్తొస్తాయి. కానీ.. ప్రపంచంలో ఓ ఆటగాడి గురించి తెలిస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. ఎందుకంటే అతడి ఆదాయం గంటకు అక్షరాలా రూ.20 లక్షలు. ఇది ధోనీ, కోహ్లీ ఆదాయంతో పోల్చితే 10 రెట్లు ఎక్కువ. (MS Dhoni Kohli Remuneration)
సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీని ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లుగా గుర్తిస్తారు. వీరి ఆస్తుల విలువ కూడా భారీగా ఉంది. అయితే పోర్చుగీస్‌కు చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఆటగాడిగా గుర్తించింది. 2023 సంవత్సరానికి ఫోర్బ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో క్రిస్టియానో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
క్రిస్టియానో ఏఐ నాసర్‌కు ఆడటం ద్వారా రూ.623 కోట్లు సంపాదించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా రొనాల్డోకు భారీగానే ఆదాయం వస్తున్నట్టు స్పష్టంచేసింది. గతేడాది విరాట్ కోహ్లీ క్రికెట్ ద్వారా రూ.10కోట్లు సంపాదించాడు. ఇక ఎండార్స్‌మెంట్ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ సాలరీ రూ.12 కోట్లు.
ధోనీ, విరాట్ కోహ్లీ ఆస్తుల ఒక్కొక్కరికీ రూ.1,040 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. కానీ క్రిస్టియానో ఆస్తుల విలువ రూ.1120 కోట్లు అని ఫోర్బ్స్ తెలిపింది. క్రిస్టియానోకు రెమ్యూనరేషన్, కమర్షియల్ యాడ్స్ వంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని పేర్కొంది. సౌదీ ఫుట్ బాల్ క్లబ్‌తో ఏఐ నాసర్‌తో క్రిస్టియానో డీల్ కుదుర్చుకున్న తర్వాత అతడి ఆస్తులు అమాంతం ఆకాశాన్ని అంటాయి.
ప్రపంచంలో అత్యధిక ఆస్తులు కలిగిన ఫోర్బ్స్ ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానం దక్కించుకోవడం క్రిస్టియానోకు ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ సారి జాబితాలో ఎక్కువ మంది ఫుట్ బాల్ ప్లేయర్లే చోటు దక్కించుకున్నారు. క్రికెటర్లకు కొంతమందికే స్థానం లభించింది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ అత్యధిక రెమ్యునరేషన్ కలిగిన ఆసియా ఆటగాడిగా లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..