కింగ్ కోహ్లీ.. (Virat Kohli) అగ్రెసివ్‌కు మారుపేరు. టీమిండియాలో నాడు సౌరవ్ గంగూలీ అగ్రెసివ్‌నెస్ చూశాం. తర్వాతి కాలంలో విరాట్ కోహ్లీని (Virat Kohli) మించిన కోపధారి మనిషి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. స్వదేశమైనా, విదేశాల్లో అయినా.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే స్టైల్.. అండర్19లో ఉన్నపుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు 32 ఏళ్లు దాటినా అదే తత్వం కోహ్లీ (Virat Kohli) సొంతం. ఈ క్రమంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టు మ్యాచుల్లో స్లెడ్జింగ్ మొదలుకొని.. వన్డేలు, టీ20ల్లో కూడా బౌలర్లు, ప్రత్యర్థులపై కోహ్లీ ప్రవర్తించే తీరే భిన్నంగా ఉంటుంది. ఇక ఐపీఎల్‌లో కూడా మొదటి నుంచి ప్రత్యర్థి జట్లపై దూకుడు ప్రదర్శించే కోహ్లీ.. (Virat Kohli) తనకు తెలియకుండానే చాలా మంది హేటర్లను తయారు చేసుకున్నాడు. అదే సమయంలో కోహ్లీ దూకుడు నచ్చిన అభిమానులు అతడిని ఆశానికి ఎత్తేస్తుంటారు.
తాజాగా సోమవారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తీరు మరోసారి వివాదాస్పదం అయ్యింది. ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించేది. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మసాలా కూడా తోడయ్యింది. లక్నో వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదిక అయ్యింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య ప్రారంభమైన వర్డ్స్ ఎక్స్ ఛేంజ్.. చివరకు కోహ్లీ వర్సెస్ గంభీర్, కోహ్లీ వర్సెస్ లక్నో టీమ్ అన్నట్లు తయారైంది. మ్యాచ్ ఆద్యంతం నాటకీయ పరిణామాల మధ్య సాగింది.
మధ్యలో కాసేపు వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. స్వల్ప స్కోరు చేసినా దాన్ని ఆర్సీబీ డిఫెండ్ చేసుకోగలిగింది. మ్యాచ్ తర్వాత ఘర్షణ నేపథ్యంలో లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. మరోవైపు వివాదానికి కారణమైన నవీన్ ఉల్ హక్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది.
మొత్తంగా కోహ్లీ 1.07 కోట్లు, గంభీర్‌కు రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్‌కు రూ.1.79 లక్షలు ఫైన్ రూపంలో చెల్లించనున్నారు. అంతుకు ముందు కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయంతో లక్నో బ్యాటర్లు, మెంటార్ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆవేష్ ఖాన్ హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. గంభీర్ కూడా చిన్నస్వామి క్రౌడ్‌కు వేలు చూపిస్తూ అగ్రెసివ్‌గా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఈ తతంగాన్ని కోహ్లీ మనసులో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అనంతరం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 126 పరుగులే చేసింది.
Don't mess with #kohli😎#LSGvsRCB #LSGvRCB pic.twitter.com/S5DWNg66Cd
— Fukkard (@Fukkard) May 1, 2023
అయితే, లక్ష్య ఛేదనలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 77 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది లక్నో. చివర్లో నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా కాసేపు క్రీజులో ఉండి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెరో రెండు ఫోర్లు కొట్టారు. ఇక్కడే విరాట్ కోహ్లీ.. నవీన్ ఉల్ హక్‌ను స్లెడ్జ్ చేశాడు. తర్వాత నవీన్ ఔట్ కాగానే కోహ్లీ సెలబ్రేట్ అతిగా చేసుకున్నాడు. దీనికి నవీన్ కూడా రియాక్ట్ అయ్యాడు. అక్కడే గొడవ మొదలైంది.
వర్డ్స్ ఎక్స్‌ఛేంజ్ ఇలా మొదలైంది..
ఆర్సీబీ విజయం సాధించగానే ప్లేయర్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకోసాగారు. ఈ సమయంలో కూడా నవీన్ ఉల్ హక్ కోహ్లీని ఏదో తిడుతూ మాట్లాడాడు. అందుకు విరాట్ కూడా మాటలు ఎక్స్‌ఛేంజ్ చేశాడు. అనంతరం లక్నో ప్లేయర్ మేయర్స్ కోహ్లీ వద్దకు వచ్చి మాట్లాడుతుండగా మెంటార్ గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు లాక్కెళ్లాడు. ఇక్కడే కోహ్లీ, గంభీర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇద్దరూ పరస్పరం దగ్గరకు వచ్చి వర్డ్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నారు. ”అసలేం జరిగిందో చెబుతా విను…” అంటూ కోహ్లీ వివరించే ప్రయత్నం చేశాడు. అయితే, కోహ్లీ చెప్పే మాటలను తాను కన్సిడర్ చేయనన్నట్లు గంభీర్ మాట్లాడాడు.
All fights from LSG vs RCB#LSGvsRCB #Kohli #Gambhir #Mishra #naveen #ipl #mayers pic.twitter.com/09rgro5CN3
— SRK FAN (@King_Of_World_) May 1, 2023
అనంతరం వీరి గొడవను సద్దుమణిగించడానికి కేఎల్ రాహుల్, మేయర్స్, అమిత్ మిశ్రా తదితరులు వచ్చారు. ఆర్సీబీ క్రికెటర్ కేదార్ జాదవ్ కూడా స్పాట్‌లోకి వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంత గొడవ జరుగుతున్నా ఆర్సీబీ ప్లేయర్లు వారించేందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
#Gambhir का जितना कैरियर है #Kohli उससे ज़्यादा मैच तो अभी खेलेगा, गंभीर के जितने रन हैं उससे ज़्यादा तो अभी विराट कोहली बनाएगा, गंभीर की खेलते हुए जितनी कमाई रही उससे ज़्यादा विराट के रिटायरमेंट के बाद होगी, गंभीर के जितने फ़ैन्स भारत में है उससे ज़्यादा तो विदेशों में विराट के… pic.twitter.com/wOAMDYKMGB
— Prashant Anand (@prashantanandg) May 2, 2023
గతంలోనూ గుర్తుండిపోయేలా రివెంజ్..
కోహ్లీ అగ్రెసివ్‌నెస్ ఇప్పుడే కాదు.. గతంలో ఆస్ట్రేలియాలో స్మిత్, మిచెల్ స్టార్క్, టిమ్ పైన్ లాంటి క్రికెటర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తనపై స్లెడ్జింగ్‌కు దిగితే తగిన రీతిలో బదిలివ్వడం విరాట్ స్పెషాలిటీ. వెస్టిండీస్ పర్యటనలో తనను ఔట్ చేసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్న బౌలర్‌పై కోహ్లీ రివెంజ్ తీర్చుకున్న తీరు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటుంది. ఐపీఎల్‌లోనూ గంభీర్‌తో గతంలో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. అపొజిషన్‌పై తనదైన శైలిలో స్పందించే కోహ్లీ తీరుకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. అదే క్రమంలో కోహ్లీని హేట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. కోహ్లీని మెచ్చుకుంటూ కొన్ని మీమ్స్ పేజీలు పోస్టులు చేస్తుండగా, నవీన్ ఉల్ హక్‌ను పొగుడుతూ, గంభీర్‌ను ఆకాశానికెత్తేస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
King🤙😎🔥#ViratKohli #Kohli #Rcb #LSGvsRCB pic.twitter.com/0LEFANCS82
— HaRSHith ViRat🕊️ (@YasHARSHi18) May 1, 2023
Read Also : PBKS vs LSG : రికార్డులు బద్దలయ్యాయి.. లక్నో, పంజాబ్ మ్యాచ్‌లో విశేషాలివీ..