HomeAndhra PradeshRachamallu: హామీలు అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌

Rachamallu: హామీలు అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌

Rachamallu: నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ గ్రాఫ్‌ పడిపోయిందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (Rachamallu) ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని.. ఆయన వ్యక్తిత్వం అపవిత్రం అని, ఆయనది కళంకిత రాజకీయం అని ఆక్షేపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌తో అన్ని వేళల్లో అందరినీ మోసం చేసి మభ్య పెట్టలేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తుంటామని తేల్చి చెప్పారు. నాలుగు నెలల్లో పెన్షన్‌ మొత్తం పెంచడం మినహా, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని గుర్తు చేశారు. అందులోనూ ప్రతి నెలా కోత పెడుతూ, ఇప్పటికే 1.5 లక్షల పెన్షన్లు తొలగించాని వెల్లడించారు.

విజయవాడ వరదల్లో ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో, భారీ నష్టం సంభవించిందని.. మరోవైపు బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, 10 శాతం మందికి కూడా సాయం చేయలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వరద బాధితులకు సాయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని, దాతలు ఇచ్చిన వందల కోట్ల విరాళాలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త అంశాన్ని తెర మీదకు తెస్తారని, అందులో భాగంగానే టీటీడీ లడ్డూపై ఆరోపణలు చేశారని తెలిపారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిలదీసినా చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. నిజానికి టీటీడీ లడ్డూలో కల్తీ లేదని, చంద్రబాబే వ్యక్తిత్వమే కల్తీ అని, ఆయనే కళంకితుడని మాజీ ఎమ్మెల్యే అభివర్ణించారు.

ఇవీ చదవండి: Ambati Rambabu: అధికారం అండతో.. విచారణ లేకుండానే అంగళ్లు కేస్‌ క్లోజ్‌!
Jammalamadugu: కాలితో తంతా.. ఫుట్ బాల్ ఆడతా.. అడ్డంగా నరికేస్తా..!
Dasara: దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
Upcoming Telugu Movies: ఈ దసరాకు సినిమాల జాతర.. ఏయే సినిమాలొస్తున్నాయంటే..
Vijayawada: విజయవాడలో పోలీసుల పేకాట.. వీడియో వైరల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు