HomeAndhra PradeshSharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం

Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం

Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ  (Congress) విజయమని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి అన్నారు. తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి, యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) లో తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తమ పార్టీ విజయమేనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మాట ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ మీ పక్షం అని షర్మిల పేర్కొన్నారు. మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని ప్రకటించారు.

ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని షర్మిల తెలిపారు. ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని షర్మిల పేర్కొన్నారు.

ఇవీ చదవండి: YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ
MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు