HomeAndhra PradeshVarudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు

Varudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు

Varudu Kalyani: పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన అసిఫియా అంజుమ్‌ అనే ఏడేళ్ల బాలిక సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో శవమై తేలేదాక పోలీసులు కనిపెట్టలేకపోయారని, ఫిర్యాదు అందినప్పుడే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈరోజు తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదని వైయస్సార్ సీపీ (YSRCP) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు.

అసిఫియా శరీరంపై గాయాలున్నాయని, పాపకు రక్తస్రావం జరిగిందని తల్లిదండ్రులు చెబుతుంటే, పోలీసులు మాత్రం ఏ దర్యాప్తు చేయకుండానే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. సీఎం సొంత జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగినా, మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల పాలిట చీకటి పాలన అన్న వరుదు కళ్యాణి, కూటమి నాలుగు నెలల పాలనంతా ఆడవారికి చీకటి రోజులేనని అభివర్ణించారు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, క్షణాల్లో స్పందించిన సీఎం, ప్రత్యేక హెలికాప్టర్‌లో డీజీపీ, సీఐడీ చీఫ్, రెవెన్యూ స్పెషల్‌ సెక్రటరీలను పంపించారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ, ఆ మాత్రం తగలబడిన పేపర్లకున్న విలువ బాలిక ప్రాణాలకు లేదా అని నిలదీశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికను చంపేసి నదిలో పడేస్తే ఇంతవరకు పోలీసులు కనీసం మృతదేహాన్ని కూడా కనిపెట్ట లేకపోయారన్న ఆమె, ఇది ఆడవారిని అంతమొందించే ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళలు, యువతుల రక్షణలో దిశ యాప్‌ ఒక కవచంలా పని చేసిందన్నారు. దిశ పోలీసులు కూడా అత్యుత్తమ సేవలందించారని చెప్పారు. హోం మంత్రి సొంత నియోజకవర్గంలో ఆమె అనుచరులు ఇద్దరు మహిళలను దారుణంగా హింసిస్తే, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టిన గొప్ప ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. యలమంచలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే మహిళను సురేష్‌ అనే యువకుడు చంపేసినా హోంమంత్రికి చీమకుట్టిన్నయినా లేదన్నారు. ఆ ప్రాంతానికి సన్మానానికి వెళ్లింది తప్ప, బాధితురాలి కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని తెలిపారు. గత వారం పుంగనూరులో బాలిక అదృశ్యమైనప్పుడు అక్కడే ఉన్న పవన్‌ కళ్యాన్‌.. ఆ ఘటనపై స్పందించి ఉంటే బాలిక ప్రాణాలు దక్కేవన్నారు.

మంత్రి లోకేశ్‌ సొంత నియోజకవర్గంలో మూడు ఘటనలు, కోవెలకుంట్లలో మతి స్థిమితం లేని ఆడపిల్లపై అత్యాచారం, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటన.. ఇలా మహిళలపై రోజుకో దాడి జరుగుతూనే ఉంటే.. కాపాడమని చెప్పుకోవడానికి ఒక్క వ్యవస్థయినా రాష్ట్రంలో ఉందా అని నిలదీశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకొంటున్నారు కానీ, ఆడపిల్లల ప్రాణాలకే గ్యారెంటీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందన్న వరుదు కళ్యాణి, ఈనెల 9న పుంగనూరులో బాధిత కుటుంబాన్ని జగన్‌ పరామర్శిస్తారని తెలిపారు.

ఇవీ చదవండి: YSRCP Youth President: వైయస్సార్‌సీపీలో వరుస మార్పులు.. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి
YS Sharmila: సెక్యులర్ పార్టీ రైటిస్ట్ పార్టీ అయ్యింది.. పవన్‌పై వైయస్ షర్మిల ఫైర్
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు