Srinivasa Varma: గత జగన్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. టీటీడీ లడ్డు విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీ ని బీజేపీ నిలదీసిందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు.
’’అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రధం తగలపెట్టిన సంఘటన లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హిందూ వ్యతిరేక పరమైన దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి. గత ప్రభుత్వంలో జగన్ తిరుపతిలోనే నియమ నిబంధనలు పాటించలేదు. సీఎం హోదాలో స్వామి వారి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఉండాలి. కానీ అలాంటి నిబంధనలు పాటించకుండా జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని హేళన చేశారు.
ఏడుకొండలని రెండు కొండలు చేస్తామని ఆనాడు వైస్సార్ చెప్పారు. అన్యమతస్తులు వెళ్ళటానికి ఇబ్బందులు లేవు కానీ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. శాస్త్రానికి, ధర్మానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ వైఖరి అవలంభించారు. తిరుపతి విషయంలో హిందూ ఆరాధ్య దైవమైన స్వామి వారి పట్ల మీ వైఖరి సరైనిధి కాదు.
గతంలో ఏ స్టీల్ మంత్రి కూడా ఫ్యాక్టరీ ని సందర్శించి కార్మికులతో మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ కుమారుస్వామి మేము వెళ్లి అక్కడ కార్మికులతో మాట్లాడటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి, మేము అంతా కూడా ఏవిధంగా ముందుకి తీసుకెళ్లాలనేది తీవ్రంగా కృషి చేస్తున్నాం. కార్మికుల పొట్ట కొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాలని అనేక ప్రత్యామ్నాయం ఆలోచనలు మొదలుపెట్టాం.
పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. వాటిని నివారించి శాశ్వత గాడిలో పెట్టాలనేది కేంద్ర ఆలోచన. విశాఖ ఉక్కు అనేది ప్యాకేజీ కి పర్మితం అవ్వకూడదు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అనేక విషయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈరోజు రైల్వే జనరల్ మేనేజర్, DRM అధికారులతో కొన్ని అంశాలపై చర్చించటం జరిగింది.
నర్సాపురం – కోటిపల్లి లైన్ గురించి ప్రస్థావించటం జరిగింది. గత ప్రభుత్వం లో ఎలాంటి లైన్లు నిర్మాణాలు జరగకపోవటం ప్రయాణికులు ఇబ్బందులకి గురయ్యారు. రాష్ట్రంలో ఎక్కువ వందేభారత్ రైళ్ళని తీసుకురావాలని చర్చించటం జరిగింది. విజయవాడ నుంచి వారణాసి వెళ్లే ప్రత్యేక రైలు, వైజాగ్ నుంచి నర్సాపురం మీదుగా వారణాసి వెళ్ళటానికి ప్రత్యేక రైళ్ళని ఉంచాలని ప్రతిపాదించాం.
విశాఖ రైల్వే జోన్ కి కేంద్రం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం వీటిపై ద్రుష్టి పెట్టకపోవటంతోనే ఆలస్యం అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ జోన్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. నర్సాపురం టూ బందర్ ఒక కొత్త లైన్ గురించి చర్చించాం.’’ అని శ్రీనివాస వర్మ తెలిపారు.
ఇవీ చదవండి: AP BJP: నామినేటెడ్ పదవులపై టీడీపీ-బీజేపీ మధ్య పేచీ
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం
UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు
Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?
