Nandigam Suresh: వైయస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. షరతులకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. బాపట్ల పార్లమెంటరీ నియోజక వర్గ వైయస్సార్ సీపీ బాధ్యుడిగా నందిగం సురేష్ ప్రస్తుతం కొనసాగుతున్నారు.
కాగా 2020లో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన రాళ్ల దాడిలో మెండం మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగింది. అప్పుడు ఎంపీగా ఉన్న సురేష్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపణలు చేశారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఆందోళనతో మాజీ ఎంపీ సురేష్ పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఈ కేసు తదనంత కాలంలో కనుమరుగైంది. మరోవైపు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ క్రమంలోనే మరియమ్మ కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ రాగానే మరో కేసు క్యూలో నిలిచినట్లయింది. ఈ కేసులో సురేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గత నెలలో మంగళగిరి న్యాయస్థానంలో పీటీ వారంట్ వేశారు. తాజాగా గురువారం పీటీ వారంటుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 7న గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళగిరి కోర్టులో నందిగం సురేష్‌ను తుళ్లూరు పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇలా ఉండగా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు అయిన నందిగం సురేష్,శ్రీనివాసరెడ్డిల రిమాండ్ ను మరోసారి పొడిగించారు. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు నందిగం సురేష్ కు ఈ కేసులో బెయిల్ లభించింది.
ఇవీ చదవండి: Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు
YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
Ambati Rambabu: వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో చంద్రబాబు డ్రామా
