HomeAndhra PradeshTirumala: నేటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala: నేటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala: నేటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తిరుమలలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు (Tirumala) ప్రారంభంకానున్నాయి. సర్వాంగ సుందరంగా తిరుమల ముస్తాబైంది. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌ల్లో పాల్గొనే భ‌క్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. భ‌క్తులంద‌రికీ ఇబ్బందులు లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది టిటిడి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడ వాహనసేవను సాయంత్రం 6.30 నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11 గం. వరకు జరుగుతుంది. నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దిన గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేలా ఏర్పాట్లను టీటీడీ చేసింది.

మరోవైపు దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్‌ షో ద్వారా ప్రదర్శించారు. వందలాది మంది భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు.

వార్షిక ఆదాయం రూ.50 వేల కన్నా తక్కువ ఉన్న చిన్న ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు ఒకప్పుడు నెలకు రూ.2,500 చెల్లించేవారు. 2015లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.5,000లకు పెంచింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రూ.10,000లకు పెంచారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read also: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు
Tirupati Varahi Sabha: ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు