HomeAndhra PradeshTirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు

Tirumala Laddu: తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటే మంచిదని జస్టిస్ గవాయ్ సూచించారు. ఐదుగురు సభ్యుల సిట్ లో ఇద్దరు కేంద్రం నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉండాలన్నారు. ఇందులో రాజకీయ డ్రామా వద్దు అని తేల్చి చెప్పారు.

సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిట్ సభ్యులుగా సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యులు, FSSAI నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.

నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఉ.10.30కు విచారణ మొదలు పెట్టింది.
స్వతంత్ర దర్యాప్తు పై నేడు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మసనం విచారణ జరిపింది.

సిట్ కొనసాగించాలా ? స్వతంత్ర దర్యాప్తు వేయాలా ? అనే అంశ పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీం కోర్టు కోరింది.

నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో సుప్రీంకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

కల్తీ అంశం పై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికిన సుప్రీం.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది.

జూలైలో రిపోర్టు వస్తే …సెప్టెంబర్ లో మీడియాకు ఎందుకు చెప్పారు? అని గతంలో ప్రశ్నించింది. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలని సూచించింది.

కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని ఆ సందర్భంగా తెలిపింది. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా ? అని గతంలో ప్రశ్నించింది.

కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ? అని ప్రశ్నించింది. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు? అని గత విచారణ సందర్భంగా సుప్రీం ప్రశ్నలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి: Chinta Mohan: తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేపనూనె కలిసిందనేది అబద్ధం
Tirumala Laddu: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ 
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం? 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు