HomeAndhra PradeshChinta Mohan: తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేపనూనె కలిసిందనేది అబద్ధం

Chinta Mohan: తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేపనూనె కలిసిందనేది అబద్ధం

Chinta Mohan: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది అబద్ధమని, పంది కొవ్వు, చేప నూనె కలిసింది అనేది జరగని పని అని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) అన్నారు.

కల్తీ జరిగిందనేది వాస్తవం.. పామ్ ఆయిల్ మాత్రమే కలిసిందన్నారు.ఈ అంశంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాటలను, తిరుపతిలో రాజకీయాలు చేయదాన్ని ఖండిస్తున్నానన్నారు.

’’తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాటలు తీవ్ర అభ్యంతరకరం. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ ని అమలు చేయలేదు. అమరావతిలో వేల కోట్లు పెట్టి ఏమి చెయ్యాలని అనుకుంటున్నారు. కృష్ణా నదిలో రాజధానిని కట్టాలని చూస్తున్నారు. ఒకసారి ఆలోచించాలని చంద్రబాబుని కోరుతున్నా. పోలవరంపై ఎవరు ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలి.

పోలవరం రాజకీయ నాయకులకు వరంగా మారింది. పోలవరం పెద్ద ఫ్రాడ్. నేను కూడా విశాఖ ఉక్కు ఉద్యమంలో తిరిగాను. విశాఖ ఉక్కుపై కేంద్రం కుట్ర చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని కేంద్రం చూస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తి చంద్రబాబు ఒక్కడే. విశాఖలో దీక్షలు మానేసి చంద్రబాబు ఇంటి వద్ద కార్మికులు కూర్చోవాలి.

చంద్రబాబు మోడీతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలి. మోడీ ప్రభుత్వం ఏ నిమిషం అయినా పడిపోవచ్చు. హర్యానా ఎన్నికల తరువాత ఏదైనా జరగవచ్చు. టీటీడీ లడ్డు పై చంద్రబాబు చూపించిన రిపోర్ట్ లు తప్పు. ఆ రిపోర్టులు నమ్మదగినవి కాదు. కేవలం వెజిటేబుల్ ఆయిల్ మాత్రమే కలిసింది. జంతువుల ఆయిల్ లేదు. చంద్రబాబు పరమ పవిత్రుడు కాదు. ఆయన చాలా తప్పులు చేశాడు. తిరుమల లడ్డుపై చంద్రబాబు మాట్లాడింది తప్పు. జగన్ ను దెబ్బకోట్టాలని చంద్రబాబుకి ఉంటే రాజకీయంగా కొట్టాలి. లడ్డుని రాజకీయం చెయ్యడం ఎందుకు?’’ అని చింతా మోహన్ అన్నారు.

Read also: Bhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన
Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం
YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు