Samantha: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)పై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. శంకర్ (Director Shankar) దర్శకత్వంలో రానున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer)పై ఇటీవల అప్ డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ పాటను మేకర్స్ రిలీ్ చేశారు. ’’రా మచ్చా మచ్చా‘‘ అంటూ సాగే పాట యూట్యూబ్‌ను కుదిపేసింది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ తన స్టెప్పులతో అలరించాడు.
ఈ సాంగ్ చూసిన స్టార్ హీరోయిన్ సమంత.. చరణ్ డ్యాన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఆ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన సామ్ నిన్నెవరూ మ్యాచ్ చేయలేరంటూ కామెంట్ చేసింది. అన్‌మ్యాచబుల్ అంటూ పొగడ్తలు కురిపించింది. ఇదే పోస్ట్‌కు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా రిప్లై ఇచ్చింది. మిస్టర్ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్ పుట్టించారు.. అంటూ కామెంట్ చేసింది. సమంత, ఉపాసన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్‌చంద్ర, అంజలి, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక భూమిక పోషిస్తున్నారు.
Read also: Bigg Boss 8: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..
Game Changer: గేమ్ ఛేంజర్ టైమ్ ఆగయా.. హల్ చల్ షురూ
Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి రా మచ్చా.. మచ్చా సాంగ్ ప్రోమో రిలీజ్
Sony 85 Inches TV: సోనీ 85 అంగుళాల టీవీ.. ధర రూ.4,49,990 నుంచి ప్రారంభం
