Nagarjuna Akkineni: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన కామెంట్స్ పై హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలంటూ కోరారు. ఎక్స్ వేదికగా నాగార్జున పోస్ట్ పెట్టారు.
’’గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.” అని నాగార్జున పోస్ట్ పెట్టారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా..?’ అని ఎక్స్ లో ప్రశ్నించారు.
ఇవీ చదవండి: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ హాట్ కామెంట్స్..
KTR Comments: గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం రాజకీయాలు : కేటీఆర్
Bigg Boss 8: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..
YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్
