HomeTelanganaKonda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ హాట్ కామెంట్స్..

Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ హాట్ కామెంట్స్..

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యి రాష్ట్రంలో పెద్ద రచ్చ మొదలైంది. హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడని ఆమె కామెంట్స్ చేశారు.

బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కొండా సురేఖ కంట తడి పెట్టారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు చెప్పినట్లుందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు.

సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరే నని వ్యాఖ్యానించారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా కేటీఆరేనన్నారు. హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడంటూ ఆరోపించారు. రేవ్ పార్టీలతో హీరోయిన్ల జీవితాలను నాశనం చేశాడంటూ తీవ్ర స్థాయిలో కొండాసురేఖ విమర్శలు చేశారు. నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కేటీఆర్‌ కారణమని చెప్పారు.

ఎన్ కన్వెన్షన్ హాలును కూలగొట్టకూడదంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారన్నారు. కానీ అందుకు సమంత అందుకు ఒప్పుకోలేదని, దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా సురేఖ.

ఇవీ చదవండి: KTR Comments: గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం రాజకీయాలు : కేటీఆర్
TDP Leaders in BRS: అందరూ ఆ తాను ముక్కలే కదా.. బీఆర్‌ఎస్‌లో మెజార్టీ నేతలు టీడీపీ నుంచి వచ్చినవారే.. కేటీఆర్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌
Minister KTR: తెలంగాణలో ఉన్నది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్‌.. మంత్రి కేటీఆర్‌ కామెంట్స్‌
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు